అక్కడ 52 ఏళ్లుగా ఎగరని జాతీయ జెండా..
– మోదీ జీ మీరైనా చెప్పండి ప్లీజ్!.. ఛత్తీస్‌గఢ్ పీసీసీ అధ్యక్షుడు మోహన్ మార్కం
రాయ్‌పూర్ ముచ్చట్లు:
ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్‌కు జాతీయ జెండాను కొరియర్‌లో పంపారు ఛత్తీస్‌గఢ్ పీసీసీ అధ్యక్షుడు మోహన్ మార్కం. ఖాదీతో తయారు చేసిన ఆ త్రివర్ణ పతాకాన్ని మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఎగురవేయాలని కోరారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరు జాతీయ జెండాను తమ డీపీలుగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అలాగే ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని కోరారు. మోదీ పిలుపుతో విపక్ష నాయకులు, ప్రముఖులు ఇప్పటికే తమ డీపీలను మార్చుకున్నారు. కానీ ఆర్‌ఎస్‌ఎస్, దాని చీఫ్ మోహన్ భగవత్ మాత్రం డీపీని మార్చలేదు.దీంతో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ను సంస్థ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసేలా విజ్ఞప్తి చేయాలని ప్రధాని మోదీని కోరారు మోహన్ మార్కం. గత 52 ఏళ్లుగా ఆ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయలేదని పేర్కొన్నారు. అందుకే ఈసారైనా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలన్నారు.

Tags: The national flag has not flown there for 52 years.
