Natyam ad

వాడవాడల రెపరెలాడిన జాతీయ జెండా

పుంగనూరు ముచ్చట్లు:

గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. కోర్టు ఆవరణంలో న్యాయమూర్తులు వాసుదేవరావు, కార్తీక్‌, సిందు కలసి పతాకావిష్కరణ చేసి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను వివరించారు. అలాగే మండల కార్యాలయంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ,పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ కలసి జెండాను ఎగురవేసి వందనసమర్పణ చేశారు. మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా , కమిషనర్‌ నరసింహప్రసాద్‌ కలసి జెండాను ఎగురవేశారు. అలాగే పట్టణంలో జరుగుతున్న నిత్యజాతీయగీతాలాపనలో కమిటి సభ్యులు ప్రకాష్‌, అయూబ్‌, దీపక్‌, రెడ్డివినయ్‌, ఆకాష్‌, ఎం.బాబు, కోటరెడ్డిప్రసాద్‌, వెంకటేష్‌తో పాటు ఆయాప్రాంతాలలోని ప్రజలు పాల్గొని జనగణమన ఆలపించారు. పోలీస్‌స్టేషన్‌లో సీఐ రాఘవరెడ్డి, తహశీల్ధార్‌ కార్యాలయంలో తహశీల్ధార్‌ సీతారామన్‌ జాతీయ జెండాను ఎగురవేసి వందనసమర్పణ చేశారు. మార్కెట్‌ కమిటిలో చైర్మన్‌ అమరనాథరెడ్డి పతాకావిష్కరణ చేశారు. అలాగే రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి పాఠశాలలో డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ స్వాతంత్య్రసమరయోధుల వేషధారణలో వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో పతావిష్కరణలు చేసి విద్యార్థులకు గణతంత్ర వేడుకల గురించి వివరించారు.

Post Midle

 

Tags: The national flag waved by the people

Post Midle