ప్రకృతి నాశనమైతే మానవ మనుగడే ప్రమాదం

The nature of human existence is the danger of human survival

The nature of human existence is the danger of human survival

Date:14/08/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
ప్రకృతి నాశనమైతే మానవ మనుగడే ప్రమాదంలో పడుతుంది. మొత్తం జీవజాలమే నశిస్తుంది. ఈ స్పృహ ముఖ్యంగా యువతలో కలిగించాలి. వారు తమ బాధ్యతను గుర్తించి భాగస్వాములు కావాలని రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపు నిచ్చారు. “ప్రకృతిని రక్షించుకుందాం భవిష్యత్ ను కాపాడుకుందాం” అనే థీమ్ తో సెప్టెంబర్ 17 18 తేదీల్లో రవీంద్రభారతి ఆడిటోరియంలో యువతీ యువకులకి అనేక పోటీలు నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు.
దీనికి సంబందించిన 2కే18  పోస్టర్(గోడపత్రిక)ను మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్బంగా గుత్తా మాత్లాదు౫థు  ప్రస్తుత వరదలు, కరువులకు కారణం ప్రకృతిలో మార్పులే కారణం. మనిషి చేస్తున్న విధ్వంసంతో ప్రళయాలు ఏర్పడుతున్నాయి. వాతావరణ మార్పులు  వ్యవసాయం మీద ప్రభావం చూపించి రైతులకు నష్టం కలగజేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతిని కాపాడుకొని భవిష్యత్తరాలకు అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు  తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణ అంతా పచ్చగా మార్చాలని కృషి చేస్తున్నారు. డెవలప్మెంట్ అండ్ సైంటిఫిక్ విజన్ అకడమిక్ సొసైటీ వారు  ప్రకృతి 2కే18 పేరుతో ఎన్విరాన్మెంటల్ కల్చరల్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇది ఒక వినూతనమైన కార్యక్రమం. ప్రకృతిని కాపాడుకోవడం తమ బాధ్యతగా గుర్తింపచేసి, ప్రకృతిని కాపాడే కార్యక్రమాల్లో వారిని భాగస్వాములు చేయడానికి ఇది తోడ్పడుతుంది.  ఇది ఒక మంచి అద్భుతమైన కార్యక్రమం.  తెలంగాణ వికాసానికి తోడ్పడే కార్యక్రమం అందుకే నేను కూడా ఇందులో భాగస్వామ్యమైనాను. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై దీని జయప్రదానికి కృషి చేయాలి.
తెలంగాణ వికాసానికి హరితహారం అనే  ముఖ్యమంత్రిగారి ఆలోచనలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నామని  గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు.
Tags:The nature of human existence is the danger of human survival

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *