అలరించిన నేవీ బ్యాండ్

విశాఖపట్నం ముచ్చట్లు:


ఆజాధీకా అమృత్ మహోత్సవ్ లో భాగం గా నేవీ బ్యాండ్ హైలెట్ గా నిలిచింది.క్రమశిక్షణకు మారుపేరు గా నిలిచే నేవీ సిబ్బంది బ్యాండ్ మ్యూజిక్ వీనుల విందు చేసింది. విశాఖ రామకృష్ణ బీచ్ లో జరిగిన  తిరంగా ర్యాలీ అందరిని ఆకట్టుకుంది.టియూ 142 యుద్ధ విమానం నుంచి పార్క్ హోటల్ వరకు నేవీ, స్టేట్ పోలీస్,ఎన్ సిసి ఆద్వర్యం మార్చ్ ఫాస్ట్ జరిగింది. అనంతరం కురుసుర సబమెరైన్ ఎదురుగా తూర్పు నౌకాదళ సిబ్బంది చేసిన నేవీ బ్యాండ్ పర్యాటకులను ఆకట్టుకుంది. జాతీయ గీతాలు,సినిమా పాటలకు నేవీ బ్యాండ్ అందించిన సంగీతం పర్యాటకులను కట్టిపడేసింది.

 

Tags: The Navy Band entertained

Leave A Reply

Your email address will not be published.