వైద్యుల నిర్లక్ష్యం… ఐదేళ్ల చిన్నారి మృతి

ఆసుపత్రి ముందు బంధువుల అందోళన

Date:05/12/2019

తిరుపతి ముచ్చట్లు:

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల చిన్నారి చనిపోయిందంటూ  బంధువులు తిరుపతి లోని అమ్మ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. ఈ నెల 2వ తేదీన ఐదేళ్ల మౌనిషా రెడ్డికి జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేర్చారు.అయితే పాపకు డెంగ్యూ జ్వరం అని వైద్యులు ట్రీట్మెంట్ చేసినట్టు బంధువులు చెబుతున్నారు. పాపకు మరింతగా ఆరోగ్యం క్షీణించడంతో చెన్నై అపోలో ఆసుపత్రికి నిన్న తీసుకువెళ్లారు. అయితే పాపకు డెంగ్యూ జ్వరం లేదని తిరుపతి వైద్యులు అధిక మోతాదు మందు ఉన్న ఇంజక్షన్ ఇవ్వడం వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయి చనిపోయిందని అపోలో వైద్యులు నిర్ధారించి నట్టుగా  పాప పేరెంట్స్  చెబుతున్నారు. .దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన  చిన్నారి బంధువులు  తిరుపతిలోని అమ్మ ఆసుపత్రి  దగ్గర ఆందోళన నిర్వహించారు . పోలీసులకు ఫిర్యాదు చేశారు . దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు  అమ్మ ఆస్పత్రి  చైర్మన్ డాక్టర్ సతీష్  న7 అరెస్టు చేసి స్టేషన్కు తీసుకువెళ్లారు . ఈ సందర్భంలో   డాక్టర్ సతీష్ పై పాప బంధువులు  దాడి చేసేందుకు ప్రయత్నించడం తో పోలీసులు వారిని అడ్డుకుని  డాక్టర్ సతీష్ అన్న స్టేషన్కు తరలించారు.  తమ ఒక్కగానొక్క పాపను  నిర్లక్ష్యం వైద్యంతో చంపేసిన  డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు బంధువు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

కూరగాయల దాతలతో అదనపు ఈవో భేటీ

 

Tags:The neglect of doctors … the death of a five-year-old child

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *