విద్యుత్ శాఖ అధికారులు అలసత్వం..వ్యక్తి మృతి
ఏలూరు ముచ్చట్లు:
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలోని పామాయిల్ తోటకు నీరు పెడుతూ కరెంట్ వైర్లను తాకడంతో వ్యవసాయ కూలీ కొమ్ము బాబురావు షాక్ కు గురై మృత్యువాత పడ్డాడు. క్రిందకు వేలాడుతున్న హైటెన్షన్ తీగలను సరిచెయ్యాలని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు రైతులు ఫిర్యాదు చేసారు. అయినా సమస్య అలాగే వుండిపోయింది. అధికారుల అలసత్వంకు బాబురావు మృతి చెందడంతో కుటుంబ పెద్దను కోల్పోయి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Tags: The negligence of the electricity department officials..a person died

