పకడ్భందిగా నూతన మున్సిపల్ చట్టం అమలు చేయాలి  రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్

జగిత్యాల ముచ్చట్లు:

జిల్లాలోని 5 మున్సిపాల్టీలలో  పకడ్భందిగా నూతన మున్సిపల్ చట్టం ను అమలు చేయాలని   రాష్ట్ర పురపాలక శాఖ  ప్రిన్సిపాల్ సెక్రటరీ  అరవింద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.  బుధవారం జగిత్యాల జిల్లాలోని 5 మున్సిపాల్టీలలో నిర్వహిస్తున్న పట్టణప్రగతి  కార్యక్రమం, నూతన మున్సిపల్ చట్టం అమలు  సంబంధిత అంశాల పై  కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో  ఆయన సమీక్ష నిర్వహించారు.  సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు పట్టణాభివృద్ది దిశగా అధికారులు సమన్వయంతో  పనిచేయాలని   ప్రిన్సిపాల్ సెక్రటరీ సూచించారు. నూతన మున్సిపాల్ చట్టంలో స్పష్టంగా పేర్కోన్నప్పటికి  అక్రమ లేఅవుట్లు   రాష్ట్రంలో  వస్తున్నట్లు సమాచారం అందుతుందని, దీని పై అధికారులు కఠినంగా వ్యవహరించాలని  ఆదేశించారు.   జిల్లా వ్యాప్తంగా  గ్రామపంచాయతిలలో, మున్సిపాల్టీలో ఉన్న లేఅవుట్ వివరాలను ముందుగా సేకరించాలని  ఆయన సూచించారు.  నూతన మున్సిపల్ చట్టం 2019  వచ్చిన తరువాత ప్రారంభించిన  లేఅవుట్ వివరాలు సేకరించి,  అందులో తప్పనిసరిగా నిబంధనల  ప్రకారం ఓపెన్ స్పేస్ ఉండే విధంగా  చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. లేఅవుట్లు అనుమతించే సమయంలో  ఓపెన్ ల్యాండ్ ను సదరు  మున్సిపాల్టీ  పేరిట  రిజిస్టర్ చేయాలని ఆయన సూచించారు.  మున్సిపాల్టీ పేరిట రిజీస్టర్ అయిన భూమిలో  నేమ్ బోర్డు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటే విధంగా ప్రణాళిక సిద్దం చేయాలని  సూచించారు.  నూతన మున్సిపల్ చట్టం ప్రకారం  లేఅవుట్ లకు అనుమతి తప్పనిసరి అని, అయినప్పటికి కొన్ని అనుమతి లేని లేఅవుట్లు వస్తున్నాయని  తెలిపారు.  జిల్లాలోని ప్రతి మున్సిపాల్టీకి 2 కిమి రేడియస్ పరిధిలో  పర్యటించి లేఅవుట్ వివరాలు సేకరించాలని,  అనుమతి లేని అక్రమ లేఅవుట్ల పై కఠిన  చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.  ప్రతి వారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో  లేఅవుట్ అనుమతుల పై  టెలీ కాన్పరెన్సు ద్వారా సమీక్ష నిర్వహిస్తామని  తెలిపారు. జగిత్యాల పట్టణంలో మరియు రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రణాళికాబద్దంగా మొక్కలు నాటాలని,    వాటి సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని  ఆయన సూచించారు. నూతన  సమీకృత కలెక్టరేట్  నిర్మాణం  దాదాపు పూర్తయిందని, త్వరలో  సీఎం కేసిఆర్  ఆవిష్కరించే అవకాశం ఉందని తెలిపారు.  సీఎం పర్యటించే సమయంలో మొక్కల  పెంపకం సరిగ్గా లేకపోతే  సంబంధిత అధికారులను విధుల నుండి తొలగించుటకు సైతం  అవకాశం ఉందని ఆయన స్పష్టం చేసారు.  అత్యంత  పారదర్శకంగా భవన అనుమతులు అందించేందుకు ప్రబుత్వం టిఎస్- బీపాస్ ప్రవేశపెట్టిందని,  ఇప్పటికి టౌన్ ప్లానింగ్ విభాగంలో కొంత మంది అధికారుల పై అవినితి ఆరోపణలు వస్తున్నాయని ఆయన విచారణ వ్యక్తం చేసారు.  అవినితీకి పాల్పడే అధికారులను సర్విసు నుండి తొలగించడమే  కాకుండా  క్రిమినల్  కేసులు నమోదు చేస్తామని  ప్రిన్సిపాల్  సెక్రటరీ  హెచ్చరించారు.
టిఎస్-బీపాస్ ద్వారా 75 గజాల వరకు  అనుమతి అవసరం లేదని, 75 నుంచి 600 గజాల వరకు  దరఖాస్తు చేసుకొని 15 రోజులో అనుమతులు అందిస్తున్నామని  తెలిపారు.   ప్రతి మున్సిపాల్టీలలో  టిఎస్-బిపాస్ ద్వారా అనుమతించిన భవనాలను క్షేత్రస్థాయిలో  తనిఖీ చేయాలని,  అనుమతి పొందిన సమయంలో సూచించిన ప్లాన్ ప్రకారమే నిర్మాణం జరిగిందో లేదో  పరిశీలించాలని  సూచించారు. అనుమతి పొందే సమయానికి, నిర్మాణానికి వ్యత్యాసాలు ఉన్నట్లయితే చట్టం  ప్రకారం సదరు నిర్మాణం  నిర్మూలించాలని లేదా అత్యధికంగా భారీ జరిమానా విధించాలని ఆదేశించారు.  మరో 10 రోజుల తరువాత హైదరాబాద్ నుండి  ఆకస్మికంగా తనీఖీ బృందాలు వస్తాయని, అప్పుడు నిబంధనల ఉల్లంఘన గమనిస్తే  సదరు అధికారులను సస్పెండ్ చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.   భవన నిర్మాణాలో జరుగుతున్న అవకతవకల  పై  మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఆగ్రహంతో ఉన్నారని,  నిరంతరం పట్టణాలో నిర్మాణాల తనిఖీ జరగాలని  మంత్రి సూచించారని ఆయన తెలిపారు
జిల్లాలోని  ప్రతి మున్సిపాల్టీలలో ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని,  పారిశుద్ద్య నిర్వహణ మెరుగుపర్చుకోవాలని, ప్రతి రోజు 100 శాతం ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించాలని  ఆయన సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా వార్డులో ఉన్న  నిర్మాణ వ్యర్థ పదార్థాలను,    కూలిపొయిన ఇండ్ల వ్యర్థాలను గుర్తించి వాటి తొలగింపు దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. పట్టణాలలో పూర్తి స్థాయిలో విద్యత్ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి  ప్రణాళిక సిద్దం చేసుకోవాలని, ఇంటి పై నుండి వెళ్లే  హై టెన్షన్ వైర్లు తొలగించే దిశగా  చర్యలు తుకోవాలని   అన్నారు.    ఎస్సి సాధికారతలో భాగంగా  ప్రస్తుతం చేపట్టిన పల్లెప్రగతి, పట్టణప్రగతి  కార్యక్రమంలో భాగంగా 2 రోజులు ఎస్సి  కాలనీలో  పర్యటించి  సమస్యలను గుర్తించి, మౌలిక సదుపాయాల కల్పన దిశగా నివేదిక సిద్దం చేయాలని  ఆయన  సూచించారు. ప్రతి మున్సిపాల్టీలో వైకుంఠదామం, పబ్లిక్ టాయిలెట్  ఏర్పాటు చేయాలని, దీని కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని, 2 మాసాలో వైకుంఠదామ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.ఆనంతరం
సమావేశంలో పాల్గోన్న  జిల్లా కలెక్టర్ జి. రవి  మాట్లాడుతూ   జిల్లాలోని 5 మున్సిపాల్టీల పరిధిలో 134 వార్డులలలో  2.5 లక్షల జనాభా నివసిస్తుందని  తెలిపారు.  ప్రిన్సిపాల్ సెక్రటరీ సూచించిన విధంగా  లేఅవుట్ వివరాలు  సేకరించి ఓపెన్ ప్లెస్ లలో  మొక్కల  పెంపకం ప్రారంభిస్తామని  ఆయన తెలిపారు.అనంతరం జిగత్యాల జిల్లాలో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్,  నర్సరీ,   మియావాకి విధానం ద్వారా  పెంచిన అర్భన్ పార్క్ ను  ప్రిన్సిపాల్ సెక్రటరీ  పరిశీలించారు.  అర్బన్  పార్కులో మొక్కలు పెంచుతున్న తీరును  ఆయన  అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ  సమావేశంలో
మున్సిపల్ కమిషనర్లు, సంబందిత అధికారులు తదితరులు పాల్గోన్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:The new municipal law must be enforced as an armory
Arvind Kumar, Principal Secretary, State Municipal Corporation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *