సీఎం జగన్ కు కలిసిన నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అమరావతి ముచ్చట్లు:
గురువారం నాడు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ ను రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి కలిసారు. ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి బుధవారం బాధ్యతలను స్వీకరించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం అయన ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సీఎస్ గా తనకు అవకాశం కల్పించినందుకు జగన్ కి .. జవహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి, గతంలో న సీఎం జగన్ కు ప్రత్యేక కార్యదర్శిగా కూడా పని చేశారు. జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నేతృత్వంలో చివరి వ్యక్తి వరకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తానని అన్నారు.
మరోవైపు, క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య గురువారం కలిసారు.
సమీర్ శర్మకు ప్రభుత్వం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ టూ చీఫ్ మినిస్టర్‌గా నూతన బాధ్యతలు అప్పగించింది. పూనం మాలకొండయ్య సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నిన్న బాధ్యతలు స్వీకరించారు.

Tags; The new state chief secretary met CM Jagan
