గట్టు మారడమే తరువాయి..

ఖమ్మం ముచ్చట్లు:
 
ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన.. గతంలో కమ్యూనిస్ట్‌. లెఫ్ట్‌ పార్టీల హవా నడిచిన సమయంలో సీపీఎం నాయకుడిగా గళం వినిపించేవారు. 2008లో సీపీఎం నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించి సంచలనం రేపారు. అక్కడ నుంచి ఆయన పరిస్థితి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అయిపోయింది. ప్రజారాజ్యంపార్టీలో చేరి కొన్నాళ్లు అక్కడున్నారు రామచంద్రరావు. ఆపై కాంగ్రెస్‌లో రాజకీయ ప్రయాణం కొనసాగించారు. వైఎస్‌ అభిమానిగా ఉంటూ.. ఆయన చేసిన కామెంట్స్‌ ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహానికి దారితీశాయి. పార్టీ వేటు వేయడంతో వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఇంతలో రాష్ట్ర విభజన జరగడం.. తెలంగాణలో వైసీపీ మనుగడ లేదని భావించి.. 2015లో టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు రామచంద్రరావు. అలా ఏడేళ్ల కాలంలోనే నాలుగు పార్టీల్లోకి వెళ్లిన ఘనత ఆయనదే.తక్కువ సమయంలోనే వరసగా పార్టీలు మారుతూ వచ్చిన గట్టు రామచంద్రరావు.. ఎప్పుడు.. ఎక్కడ.. ఏ పార్టీ కండువాతో కనిపిస్తారో అని వ్యంగ్యాస్త్రాలు వినిపించాయి. పోనీలే.. ఎటూ కదలకుండా టీఆర్‌ఎస్‌లో ఉంటున్నారని అనుకుంటున్న సమయంలో గత ఏడాది నవంబర్‌లో సడెన్‌గా ఆయన చర్చల్లోకి వచ్చారు. టీఆర్‌ఎస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయానని, అధికారపార్టీలో కొనసాగడం కరెక్టు కాదని చెబుతూ ఒక లేఖ రాసిపడేసి.. గులాబీ గూటికి గుడ్‌బై చెప్పేశారు రామచంద్రరావు. వాస్తవానికి టీఆర్ఎస్‌లో ఆయన ఎమ్మెల్సీ ఆశించారట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ ఎమ్మెల్సీ టికెట్‌ రాకపోవడంతో మనస్తాపం చెందారట.రెండు నెలలుగా మెడలో ఏ కండువా లేకుండా రోజులు గడిపేసిన గట్టు రామచంద్రరావు.. ఇప్పుడు కొత్త కండువాతో తళుక్కుమన్నారు. షర్మిల పార్టీలో చేరడంతో ఆయన ఖాతాలో మరో పార్టీకి చోటు దక్కింది. మరి.. వైసీపీ లో నైనా ఆయన కుదురుగా ఉంటారా? ఏ పార్టీలోనూ ఎక్కువ కాలం కొనసాగలేరనే ప్రచారాన్ని నిజం చేస్తారా? రాజకీయాల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్‌. ప్రజాప్రతినిధి కాకపోయినా.. బీసీ నేతగా జనాల్లోకి వచ్చి.. వివిధ పార్టీలలో చేరి తనకంటూ ఒక గట్టు ఏర్పాటు చేసుకున్నారు రామచంద్రరావు. కానీ ఏ పార్టీ నుంచీ చట్టసభల్లోకి వెళ్లలేకపోయారు. కొత్త శిబిరంలోనైనా ఆయన ఫెవికాల్ రాసుకుని కూర్చుంటారో.. లేక కండువా ఇస్త్రీ మడత నలగక ముందే జారిపోతారో చూడాలి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: The next step is to change the fort ..

Natyam ad