శివ క్షేత్రాల్లో నెలకొన్న భక్తుల సందడి.భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు.

బద్వేలు ముచ్చట్లు:
బద్వేలు నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగేవి గతములో ఎప్పుడు జరగని విధంగా మహాశివరాత్రి సందడి నెలకొంది నియోజకవర్గంలోని ఏడు మండలాలతో పాటు పొరుగునే ఉన్న బ్రహ్మంగారిమఠం మండలం లో కూడా శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి బద్వేలు ఆర్డిఓ ఆకుల వెంకటరమణ ఆధ్వర్యంలో 12 మండలాల రెవెన్యూ అధికారులు శివరాత్రి సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు శైవ క్షేత్రాలకు భక్తులు కుటుంబాలతో సహా ఒకరోజు ముందుగానే వెళ్లడం జరిగింది బద్వేల్ ఆర్టీసీ డిపో వారు శివరాత్రి సందర్భంగా పలు శైవ క్షేత్రాలకు  ప్రత్యేక బస్సులు ప్రవేశపెట్టారు నియోజకవర్గంలోని పలు శివాలయాలు మంగళవారం భక్తులతో కిటకిటలాడి పోయాయి శివాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు రావడం మొదలైంది ముఖ్యంగా మహిళా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు భక్తులను ఆలయానికి తీసుకెళ్లడంలో ప్రైవేటు వాహనాలు కూడా తమ వంతు పాత్ర పోషించాయి గోపవరం మండలం వెలసివున్న ప్రసిద్ధమైన శ్రీ మల్లెం కొండేశ్వర స్వామి ఆలయానికి వందల సంఖ్యలో భక్తులు రావడం జరిగింది కడప జిల్లాతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి మల్లెంకొండ ఈశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు బద్వేలు రూరల్ సిఐ వెంకటేశ్వర్లు దగ్గర ఉండి అన్ని చర్యలు తీసుకున్నారు.
 
Tags:The noise of the devotees in the Shiva temples. The Shiva temples are crowded with devotees