Natyam ad

తాడిపత్రిలో  నీటి రచ్చ రచ్చ

అనంతపురం ముచ్చట్లు:

 


అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్‌, ఎమ్మెల్యే కేతిరెడ్ది పెద్దారెడ్డి మధ్య మాటలయుద్ధం మరోసారి మొదలైంది. విమర్శలు, ప్రతివిమర్శలతో తాడిపత్రి పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. ఇంతకీ.. ఇద్దరి జేసీ బ్రదర్స్‌, ఎమ్మెల్యే కేతిరెడ్ది పెద్దారెడ్డి మధ్య ప్రతిసారి ఏదో ఒక విషయంపై తాడిపత్రిలో అధిపత్య పోరు కొనసాగుతూనే ఉంటోంది. తాజాగా.. సాగు, తాగునీరు విషయంలో ఇద్దరి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా.. HLC కెనాల్‌కు నీళ్లు రావడం లేదని, దాని వల్ల సాగు, తాగు నీటికి ఇబ్బంది అవుతోందని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ ఎస్ఈని కలిసిన ఆయన.. HLC కెనాల్‌కు నీళ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ఎస్‌ఈ నుంచి సరైన సమాధానం లేకపోవడంపై సీరియస్‌ అయ్యారు జేసీ. HLCలో నీరు లేకపోతే ఇసుక అమ్ముకోవచ్చనే ఉద్దేశంతోనే ఇవ్వడంలేదని ఆరోపించారు జేసీ దివాకర్‌రెడ్డి.జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హెచ్ఎల్సీ కాలువకు నీళ్లు వస్తున్నాయని.. అయినా ఎస్ఈని కలవడం ఎందుకని ప్రశ్నించారు. జేసీ ఆరోగ్యం బాగాలేదని, ఆయన మతిస్థిమితం లేక ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాడిపత్రి అభివృద్ధికి అడ్డుపడేది జేసీ బ్రదర్సేనని ఆరోపించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.మొత్తంగా… హెచ్‌ఎల్‌సీ నీటి కేటాయింపుల వ్యవహారం.. తాడిపత్రి రాజకీయాల్లో కాకరేపింది. జేసీ దివాకర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వార్‌ హీట్‌ పుట్టిస్తోంది. నీళ్లు ఇవ్వడంలేదని జేసీ ఆరోపిస్తే.. కావాలనే విమర్శలు చేస్తున్నారంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదేమైనా.. హెచ్‌ఎల్‌సీ వాటర్‌వార్‌ తాడిపత్రిలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

 

Tags: The noise of water in Tadipatri

Post Midle
Post Midle