ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రధమ లక్ష్యం

The number one goal is to protect the health of the people

– కమిషనర్‌ వర్మ

Date:22/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలోని ప్రజలను ఆరోగ్యవంతులుగా ఉంచడమే ప్రధమ లక్ష్యంగా పని చేస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. గురువారం ఆయన పట్టణంలోని ఎంబిటి రోడ్డు, కొత్తయిండ్లు ప్రాంతాలలో గల మురుగునీటి కాలువల్లో పేరుకుపోయిన మురుగునీటి పూడికలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వర్మ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన కాలువలైన కౌండిన్యనది కాలువతో పాటు మురుగునీటి కాలువల్లో పూడికతీసి మురుగునీటిని తొలగించే కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా ఆదేశాల మేరకు మున్సిపాలిటిలో ప్లాస్టిక్‌ను నిషేధించడం జరిగిందన్నారు. అలాగే భూగర్భజలాల మట్టం పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా పట్టణంలో జ్వరాలు ప్రభలకుండ ఉండేందుకు మురుగునీటిని యుద్ధప్రాతిపదికన పూర్తిగా తొలగిస్తామన్నారు. దోమలు ప్రభలకుండ స్ప్రే చేస్తున్నామన్నారు. మలేరియా, డెంగ్యూ దోమలను నివారించేందుకు పగటి పూట ఫాగింగ్‌ చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా పట్టణ ప్రజలు కాలువలపై ఇండ్లు నిర్మించడంతో మురుగునీటి కాలువలను శుభ్రం చేయడం కార్మికులకు కష్టతరమౌతోందన్నారు. ఈ విషయంలో పట్టణ ప్రజలు జాగ్రత్తలు తీసుకుని, కాలువల ప్రాంతాన్ని వదిలి, కట్టడాలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో ప్రజలందరు సహకరించి, పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేపట్టేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ , కార్మికులు పాల్గొన్నారు.

కృష్ణాష్టమి వేడుకలకు తరలిరండి

Tags: The number one goal is to protect the health of the people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *