The officials who visited the tribal

గిరిజనతాండాను సందర్శించిన అధికారులు

Date:24/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని సుగాలిమిట్టపెద్దతాండాలో సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు ఆధ్వర్యంలో అధికారులు సోమవారం గ్రామాన్ని సందర్శించి , ప్రజలతో సమావేశం నిర్వహించారు. తెలుగు ముచ్చట్లు వైబ్‌సైట్‌ నందు గిరిజనతాండాలో సమస్యల తిష్ట అన్న శీర్షికన ప్రత్యేక కథనం వెలువడింది. దీనిపై స్పందించిన ఎంపీడీవో, కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులతో కలసి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ట్యాంకును వినియోగించడం లేదని, పైపులైన్లు విరిగిపోయిందన్నారు. దీనిని తక్షణం మరమ్మతులు చేసి కొళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. అలాగే గ్రామంలో మురుగునీటి కాలువలు, సిమెంటు రోడ్లకు రూ.30 లక్షలను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంజూరు చేశారని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే గ్రామస్తులు కోరిన మేరకు ప్రధాన రహదారి నుంచి గ్రామ రహదారికి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారని, దీనిపై ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామన్నారు. గ్రామంలో మంచినీటి సమస్య లేదని, నీటి సరఫరాను క్రమబద్దీకరించాల్సి ఉందన్నారు.

విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని జగనన్న దీవెన

Tags: The officials who visited the tribal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *