ఎనిమిది నెలలుగా ఇంట్లో బందిగా వృద్దురాలు

Date;27/02/2020

ఎనిమిది నెలలుగా ఇంట్లో బందిగా వృద్దురాలు

హైదరాబాద్ ముచ్చట్లు:

ఎనిమిది నెలలుగా ఇంట్లోనే ఒంటరిగా ఒక వృద్ధురాలు ఉంటున్న సంఘటన ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్ మెంట్  డివిజన్ గణేష్ నగర్ లో చోటు చేసుకుంది. గణేష్ నగర్ లో శారద  అమె మహిళకు సొంతిల్లు వుంది. ఆమె ఇంట్లో సంవత్సరం క్రితం మొదటి అంతస్తులోకి గంగాధర్,  ఆయన భార్య బేబీ 72 సంవత్సరాలు తో కలిసి అద్దెకు దిగారు. కృష్ణా  జిల్లాలో ఓ గ్రామంలో  విఆర్వో పనిచేసి ఉద్యోగ విరామం పొందానని తమకు పిల్లలు లేరని ఇంటి యజమానురాలు శారదకు చెప్పి వారిద్దరూ అద్దెకు దిగారు . అప్పటి నుంచి ఆయన బయటికి వెళ్ళినప్పుడల్లా  భార్యను ఇంటిలో వుంచి  బయట తాళం వేసి వెళ్లే వాడు. ఒక్కోసారి  రెండు మూడు రోజులకు వచ్చేవాడు. ఆ సమయంలో ఇంటి యజమానురాలు శారద ఆ వృద్ధురాలిని బయట నుంచి   పలకరించి ఏదైనా అవసరం ఉంటే, అన్నం కూడా పెట్టేది. ఆంధ్రాలో తమకు వ్యవసాయం సంబంధించిన భూములు ఉన్నాయని వాటిని అమ్మి వస్తానని చెప్పిన గంగాధర్  పోయిన జులై  మొదటి వారంలో వెళ్లి  గంగాధర్ ఇప్పటివరకు కూడా రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా స్పందన లేదని మూడు నెలల కిందట ఒకసారి ఫోన్ చేసి త్వరలో వస్తానని చెప్పినట్లు ఇంటి ఓనర్  చెబుతున్నారు. ఇంతవరకు రాలేదు.  ఆ వృద్ధురాలి పరిస్థితిని చూసిని శారద  ఆమెకు కావలసిన ఆహారాన్ని అందిస్తూ వుంది.

 

Tags;The old man was a homemaker for eight months

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *