వృద్దురాలి దారుణహత్య

చిత్తూరు ముచ్చట్లు :

 

చిత్తూరు జిల్లా వికోట మండల కేంద్రంలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. పట్టణంలోని మసీదు వీధిలో నివాసముంటున్న  అభ్భాస్ భార్య అలీమా (80)ను ఎవరో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ఈరోజు ఉదయం పాలవాడు వచ్చి తలుపు తట్టినా తీయక పోవడంతో ఎదురింటివారు ఇంట్లో గమనించగా ఆమె అచేతనంగా పడి ఉంది.  దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో ఆమెను ఎవరో హతమార్చి ఇంటి డాక్యుమెంట్లను పూర్తిగా తగులబెట్టిన ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు సంబంధించిన బంగారు ఆభరణాలు లేకపోవడంతో ఎవరో దొంగలు కావాలనే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య సీఐ ప్రసాద్ బాబులు ఘటనా స్థలాన్ని సందర్శించి హత్య జరిగిన వైనం పై ఆరా తీశారు. చిత్తూరు నుంచి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ సైతం రంగంలోకి దిగాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: The old woman was murdered

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *