మే 3న గ్రాండ్‌గా వస్తున్న ‘ఒకటే లైఫ్‌’ 

The 'One Life'
Date:02/05/2019
హైదరాబాద్‌ముచ్చట్లు:
సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి తనయుడు జితన్‌ రమేష్‌ హీరోగా లార్డ్‌ వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై నారాయణ రామ్‌ నిర్మిస్తొన్న చిత్రం ‘ఒకటే లైఫ్‌’. ‘హ్యాండిల్‌ విత్‌ కేర్‌’ అన్నది ఉప శీర్షిక. శృతి యుగల్‌ కథానాయిక. ఎం.వెంకట్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్‌ మాట్లాడుతూ.. ‘‘టెక్నాలజీ వెనుక పరుగులు పెడుతున్న నేటి తరం.. హ్యూమన్‌ రిలేషన్స్‌కు, ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కథాంశంతో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాం. అమ్రీష్‌ చక్కని బాణీలు అందించారు. నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సెన్సార్‌ బోర్డ్‌ చాలా మంచి సినిమా తీశారని ప్రశంసించారు.  అని వర్గాల ప్రేక్షకులు మెచ్చుకునేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు. నిర్మాత నారాయణ్‌ రామ్‌ మాట్లాడుతూ.. ‘‘సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిఅయ్యాయి. యు/ఎ సర్టిఫికెట్‌ వచ్చింది. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం హైలెట్‌గా నిలుస్తుంది. హరీష్‌రావుగారు విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. మే నెల 3న సినిమా సినిమా అత్యధిక థియేటర్‌లలో విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు.
Tags: The ‘One Life’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *