దేశంలో కొనసాగుతున్న కరోనా తీవ్రత

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు

 

 

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. అయితే, కొద్దిరోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20వేలపైనే ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక, మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 20,409 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అదే సమయంలో 32 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,43,988 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక, కరోనా నుంచి ఇప్పటి వరకు 4,33,09,484 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 5,26,258 మంది కరోనా కారణంగా మృతిచెందారు. మరోవైపు.. 2,03,60,46,307 మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది.

Tags:దేశంలో కొనసాగుతున్న కరోనా తీవ్రత

Leave A Reply

Your email address will not be published.