Natyam ad

అవనిగడ్డలో కొనసాగుతున్న ఉద్రిక్తత

అవనిగడ్డ ముచ్చట్లు:

 

కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఉద్రిక్తత శనివారం కుడా  కొనసాగింది. శుక్రవారం నాడు అందోళన జనసేన కార్యకర్తలపై వైసీపీ నేతల దాడి నేపథ్యంలో అవనిగడ్డ బంద్ కు టీడీపీ, జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి. వందల సంఖ్యలో  పోలీసులు మోహరించారు. భాష్పవాయువు గోళాలు ప్రయోగించే వజ్ర వాహనంతో అవనిగడ్డ వీధుల్లో  కవాతు నిర్వహించారు. బంద్ కు అనుమతి లేదని వ్యాపారులు షాపులు తెరవాలని పోలీసులు  విజ్ఞప్తి చేసారు. అవనిగడ్డలో టీడీపీ జనసేన ముఖ్య నేతలను ఇళ్ళ నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. జనసేన కార్యకర్తలపై దాడి జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యే సింహద్రి రమేష్ ఇంటివద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.

 

Tags: The ongoing tension in Avanigadda

Post Midle
Post Midle