పాతబస్తీలో కొనసాగుతున్న ఉద్రిక్తత

హైదరాబాద్ ముచ్చట్లు:


బీ.ఏపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపధ్యంలో హైదరాబాద్ పాత బస్తీలో నిరసనలు గురువారం కుడా కొనసాగుతూ నే ఉన్నాయి. రాజాసింగ్ను అరెస్ట్ చేయాలంటూ ఓ వర్గం పలు ప్రాంతాల్లో బుధవారం  రాత్రి నుంచి ఆందోళనకు దిగింది. చార్మినార్, మదీన,  చాంద్రయాణగుట్ట, బార్కాస్, సిటీ కాలేజ్ తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో యువకులు  రోడ్లపై చేరి రాజాసింగ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టబొమ్మలను దహనం చేసారు. పలు ప్రాంతాల్లో పోలీసులు లాఠీ చార్జీలు జరిపారు. ని పలుప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులను మోహరిం చారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.గురువారం ఉదయం షాలిబండలో దోళన నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రంగంలోకి దింపారు. మీర్ చౌక్, చార్మినార్, గోషామహల్ జోన్ల పరిధుల్లో మొత్తం 360 మంది ఆర్ఏఎఫ్ బలగాలు విధుల్లో ఉన్నా యి. ఉద్రిక్తత నేపథ్యంలో పాతబస్తీ సహా దక్షిణ మండలంలో మద్యం, పాన్ షాపులు, దుకాణాలు, హోటళ్లు రాత్రి 8గంటలకే మూసి వేయాలని పోలీసులు ఆదేశించారు. రాత్రి కూడా పోలీసు అదనపు బలగాలు పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో పహారా కాయనున్నాయి.

 

Tags: The ongoing tension in the old town

Leave A Reply

Your email address will not be published.