Natyam ad

మహిళల చదువు సమాజానికి వెలుగని గ్రహించిన ఏకైక వ్యక్తి ఫూలే- పేర్నపాటి శ్రీరామరాజు

నెల్లూరు ముచ్చట్లు:


 బడుగు బలహీన వర్గాల కులాలకు చెందిన కుటుంబాలలో మహిళలు చదువుకొని విజ్ఞాన వంతులైతేనే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని గ్రహించిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి జ్యోతి రావు పూలే  అని విశ్వసించిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అని శ్రీరామరాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పేర్నపాటి శ్రీరామరాజు తెలిపారు. శ్రీరామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం  నెల్లూరు గ్రామీణ ప్రాంతంలోని స్థానిక బీవీ నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీరామరాజు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు సోమవారం జ్యోతి రావు పులే వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా  పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ట్రస్ట్ అధినేత  శ్రీరామరాజు మాట్లాడుతూ   థామస్ పయినే రచించిన ‘రైట్స్ ఆఫ్ మెన్’ అనే గ్రంధం పులేపై ఎంతగానో ప్రభావం చూపిందని వివరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సెక్రటరి కె. మురళీమోహన్ రాజు మాట్లాడుతూ 1848లో భారతదేశ సాంఘిక సంస్కరణల స్వరూపాన్ని మార్చిన సంఘటన జరిగిందని అన్నారు. పులే అగ్రవర్ణానికి చెందిన  మిత్రుని ఇంట వివాహనికి వెళ్లి ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. అక్కడి అగ్రవర్ణ పెద్దలు తక్కువ కులం వాడివి మాతో కలిసి నడుస్తావా అంటూ తిట్టి అవమానించారు. ఈ కారణంగా జ్యోతిరావు పూలేలో ఆనాడు కొత్త ఆలోచనలు అంకురించాయని తెలిపారు. ఈకార్యక్రమంలో శ్రీరామరాజు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మహీధర్ రెడ్డి, శ్రీనివాసులు, నవీన్ రెడ్డి, ప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags; The only person who understood the importance of women’s education to the society was Phule-Pernapati Sri Ramaraju

Post Midle