The opposition did not digest the YCP coming to power

వైసీపీ అధికారంలోకి రావడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేదు

Date:09/11/2019

విజయవాడ ముచ్చట్లు:

ఏపీలో రాజకీయం చిత్రంగా ఉంది. అధికారంలోకి వైసీపీ రావడాన్ని ప్రతిపక్షాలు ఎవరూ సుతరామూ ఇష్టపడడంలేదన్నది అర్ధమైపోతోంది. ఇక తాము ఓడామని చెప్పుకోవడం కన్నా వైసీపీది గెలుపు కాదు అని చెప్పడానికి టీడీపీ విపక్షాలు అలవాటుపడిపోయాయి. వైసీపీ ఏపీలో బలమైన పార్టీగా నిలిచి మొత్తం విపక్షాన్ని తుడిచిపెట్టేసిన తరువాత కూడా ఇంకా నమ్మకం కుదరకపోవడానికి అక్కసు ప్రధానంగా కనిపిస్తోంది. అదే సమయంలో తమ ఓటమిని జీర్ణించుకోలేని బలహీనత కూడా కనిపిస్తోంది. ఇక క్యాడర్ కి చెప్పడానికో మభ్యపెట్టడానికో ఏదనుకున్నా సరే వైసీపీకి విజయం కానే కాదు అని చెప్పడమే ఇపుడు ప్రతిపక్ష పార్టీలకు సులువుగా ఉంది. అందుకే జగన్ ఈవీఎం ల మ్యాజిక్ తో గెలిచాడు అని సీనియర్ మోస్ట్ నేత జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారు కూడా అనేస్తున్నారు. దానికి కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ అతీతుడేమీ కాదు.ఏపీలో జగన్ అసలు గెలవడు అనుకున్నవారిలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందున్నారు. ఆయన అయితే జగన్ కి సీట్లు ఒకటి రెండు తగ్గుతాయని కూడా అంచనా వేసుకున్నారు. తీరా ఫలితాలు వస్తే తమ సీట్లకే అయిదవ వంతు కు కోత పడిపోయింది. దాంతో తట్టుకోలేని బాబు తన భయంకరమైన ఓటమిని పక్కన పెట్టి జగన్ ది గెలుపే కాదు అనేస్తున్నారు. ఇక అయ్యన్నపాత్రుడుతో సహా సీనియర్ నేతలంతా జగన్ గెలుపు వెనక ఏదో జరిగిందనేస్తున్నారు. మొదట్లో నెమ్మదిగా మొదలైన ఈ వాదన ఇపుడు అయిదు నెలల్లో పరాకాష్టకు చేరుకుంది. దీనికి జగన్ మీద జనాల్లో మోజు కొంత తగ్గి ఉంటుంది.తమ మాట వింటారన్న నమ్మకం కావచ్చు.

 

 

 

 

 

 

 

అదే మాట పట్టుకుని పవన్ కళ్యాణ్ కూడా జగన్ ఏ గాలివాటంతోనో గెలిచారు అనేసే దాకా వచ్చారు. అంటే వీరందరికీ జగన్ ది గెలుపూ కాదు, ఆయన ముఖ్యమంత్రి కారు అన్న బలమైన భావన ఉంది. ఎవరికి వారే సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుని చివరికి దాన్నే నమ్మేస్తున్నారు, నమ్మించేస్తున్నారు. జగన్ ది ఫేక్ గెలుపు అని కూడా డిసైడ్ చేసేస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో జగన్ బంపర్ విక్టరీ కొట్టారు, ఆ మ్యాజిక్ మళ్ళీ సాధ్యమేనా అన్నది ఒక చర్చ. ఎందుకంటే అప్పట్లో ఓటేసిన వారంతా జగన్ ని సీఎం గా చూడాలన్న కోరికతో బలంగా ఉన్నవారు. ఇక అధికారంలోకి వచ్చాక జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సహజంగానే కొందరికి మోదంగా, మరికొందరికి ఖేదంగా ఉంటాయి. దీంతో ఈసారి ఏ ఎన్నిక వచ్చినా విపక్షాలకు గతం కంటే పరిస్థితి కొంత బాగుంటుందని ఓ అంచనా ఉంది. అదే సమయంలో సంక్షేమ ఫలితాలు ఏమైనా జనంలోకి వెళ్తే జగన్ కి అవకాశం ఉండే వీలుంది. ఏది ఏమైనా జగనే మళ్ళీ బంపర్ విక్టరీ కొడతారు అని గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు. ఇదే ఇపుడు బాబు, పవన్ లాంటి వారు జగన్ ది ఫేక్ గెలుపు అనిపించేలా చేస్తోంది. అది ఫేక్ కాదు జనం ఇచ్చిన బలమైన తీర్పు అని నిరూపించుకోవాలంటే జగన్ అర్జంట్ గా ఎన్నికలకు ఎదుర్కోవాలి. అంటే సార్వత్రిక ఎన్నికలనే కాదు, ఉప ఎన్నికలు అయినా స్థానిక ఎన్నికలు అయినా కూడా మంచి విజయం సాధించినట్లైతే కొంత కాలమైనా విపక్షాల నోళ్ళు మూతపడతాయి. మరి జగన్ దానికి రెడీ కావాలి.

 

చలికాలంలో హాస్టళ్ల విద్యార్ధుల ఇబ్బందులు 

 

Tags:The opposition did not digest the YCP coming to power

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *