ప్రతిపక్షాలకు డిపాజిట్లు కుడా రావు

The opposition does not have deposits

The opposition does not have deposits

Date:23/10/2018
కామారెడ్డి ముచ్చట్లు:
కామారెడ్డి మండల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మండల కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఆపధర్మ వ్యవసాయ శాఖ మంత్రి   పొచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజి శాసనసభ్యుడు, కామారెడ్డి తెరాస పార్టీ అభ్యర్థి  గంప గోవర్ధన్, ఇరత నాయకులు పాల్గోన్నారు. పోచారం మాట్లాడుతూ ప్రతిపక్షాల నాయకులు డబ్బులు ఎన్ని ఇచ్చిన ప్రజలు కారు గుర్తుకే ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. మా ప్రజలు పేదలైనా అమాయకులు కాదు, తమను ఆదుకునే నాయకుడిపై విశ్వాసం ఉన్నది. కెసిఆర్ నాయకత్వంపై నమ్మకం ఉన్న ప్రజలు, నాయకులు తెరాస పార్టీలో స్వచ్చందంగా  చేరుతున్నారు, మద్దతు తెలుపుతున్నారు.  కాంగ్రెస్ 50 ఏళ్ళ పాలన, టీడీపీ 17 ఏళ్ల పాలనలో కంటే తెరాస పార్టీ నాలుగేళ్ళ మూడు నెలలోనే అభివృద్ది ఎక్కువగా జరిగింది, సంక్షేమ పథకాలు ఆమలయ్యాయి.  దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది.
ప్రస్తుత అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తెరాస పార్టీ ప్రభుత్వమే ఉండాలి. వచ్చే అయిదేళ్లు ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంటే పేదల మోహాలలో చిరునవ్వు చూస్తాం.  కెసిఆర్ పట్టుదలతో రూ. 80,000 కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని తరలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది.  గతంలో మీరు ఏనాడూ ఇలాంటి ఆలోచన చేయలేదని అన్నారు. రైతు బతుకు, బాగోగుల గురించి  ఏనాడైనా ఆలోచించారా ?? మీకు ఓట్లు ముఖ్యం తప్ప ప్రజల బాధలు కాదు.  రాహుల్ గాంధీ దేశ స్థాయి నాయకుడు కదా, ఇక్కడ మాట్లాడడం కాదు మీకు దమ్ముంటే 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు పథకం, రైతుబీమా  ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలు చేయని అన్నారు. అంతేకాని ఇక్కడకు వచ్చి  రాసిచ్చింది చదవి పిచ్చి పిచ్చి గా మాట్లాడితే మా ప్రజలు ఊరుకోరు.
మనసున్న మహరాజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదింటి ఆడపిల్లకు మేనమామ లాగా కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకం ద్వారా రూ. 1,00116 అందిస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో 106 స్థానాల్లో గెలుస్తాం.  చాలా మంది ప్రతిపక్షాల నాయకులకు డిపాజిట్లు రావు.  నూతన ప్రభుత్వం ఏర్పడగానే వృద్దాప్య వయోపరిమితి 57 ఏళ్ళకు తగ్గిస్తాం.  స్వంత స్థలంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టుకోవడానికి అనుమతి ఇస్తామని అన్నారు. వ్యవసాయ రుణాలను లక్ష రూపాయల వరకు మాఫి చేస్తాం.  ప్రతి 60 మంది ఓటర్లకు ఒక ఇంచార్జిగా బూతు కమిటీల ఏర్పాటు, ప్రచారం నుండి పోలింగ్ వరకు బాధ్యత బూతు కమిటీల సభ్యులదేనని అన్నారు.
Tags:The opposition does not have deposits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *