ఎంసెట్ లీకులో అసలైన సూత్రధారులు వెంటనే అరెస్టు చేయాలి

– శ్రీచైతన్య హెడ్ ఆఫీస్ ముందు ఏబీవీపీ భారీ ధర్నా
Date:17/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఎంసెట్ లీకులో వాసుబాబు, శివనారాయణ వంటి ఏజెంట్లను కాదు, అసలైన సూత్రధారులు బి. ఎస్ రావు , నారాయణ లను వెంటనే అరెస్టు చేయాలని, తెలంగాణ లో కార్పొరేట్ విద్యను నిషేధించాలి అని డిమాండ్ చేస్తూ  మాదాపూర్ శ్రీచైతన్య హెడ్ ఆఫీస్ ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ధర్నా నిర్వహించారు.శాంతియుతంగా ధర్నా చేసి ప్రశాంతంగా ముగించిన తర్వాత పోలీసులు ఉద్దేశపూర్వకంగా 7 మందిని అదుపులోకి తీసుకోవడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అదుపులోకి తీసుకున్న  ఏబీవీపీ రాష్ట్ర నాయకులు సాయిబాబా, మహేందర్ లతో పాటు 5 మందిని వెంటనే విడుదల చేయాలి.*తెలంగాణ లో కార్పొరేట్ విద్యను నిషేదించే వరకూ ఏబీవీపీ ఉద్యమిస్తుంది. కె టీ ఆర్ కి  నిజంగా కార్పొరేట్ విద్యాసంస్థలతో లావాదేవీలు లేకపోతే బి ఎస్ రావు, నారాయణ లను వెంటనే అరెస్టు చేయాలి. కార్పొరేట్ అక్రమాలపై, సెక్స్ స్కాండల్స్ పై ప్రశ్నించినందుకే ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి పై అక్రమ కేసులు బనాయించి జైలు కు పంపారు, వెంటనే బేషరతుగా విడుదల చెయ్యాలి. కేవలము శ్రీచైతన్య 90 మంది ,నారాయణ 30 మంది విద్యార్ధులకే పేపర్ ఎందుకు లీక్ అయ్యింది. మిగతా కాలేజీలకు ఎందుకు లీకు కాలేదని ఏబీవీపీ ప్రశ్నిస్తుంది. శ్రీచైతన్య, నారాయణ ర్యాంకులన్ని బోగస్ అని తేలిపోయింది.4 కోట్ల ప్రజల స్వేదంతో కొట్లాడి సాధించుకున్న నూతన తెలంగాణ రాష్ట్రం చదువుల క్షేత్రంగా విలసిల్లాల్సిందిపోయి కార్పొరేట్ ఫీజుల దోపిడి, డ్రగ్స్, సెక్స్ కుంభకోణాలకు సేఫ్ జోన్ గా మారింది. ఎంసెట్ లీకుల వ్యవహారం శ్రీచైతన్య, నారాయణ పుట్టినప్పటినుండే  మొదలయ్యింది.  2016 ఎంసెట్ 2 లో భారి కుంభకోణం లో ఆధారాలతో బయటపెడితే అసలు లీకేజీనే జరగలేదని వాదించిన టీ ఆర్ ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా ఎవరిని కాపాడడం కోసం ఈ కేసును సాగదీస్తుందని ఏబీవీపీ ప్రశ్నిస్తుంది? ఎంసెట్ లీకేజిలో అసలు సూత్రధారులు బి. ఎస్ రావు, నారాయణలను వదిలిపెట్టి కాలికి పుండయితే కన్నుకి వైద్యం చేసినట్లుగా ఈ ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతోంది. ఈ స్కామ్ లో కె.టీ.ఆర్ పాత్ర వుంది గనుకనే అసలు నిందితులని కాపాడే ప్రయత్నాలన్ని కానిచ్చి సి ఐ డి విచారణను రాంగ్ రూట్లో మలుపులు తిప్పుతూ, వాసుబాబు, శివనారాయణ వంటి మధ్యవర్తుల అరెస్టుకే పరిమితం చేసి కేసును మూసేసేందుకు ఈ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తుంది. వెంటనే ఈ కేసును సి బి ఐ కి అప్పగించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకొన్నట్లు ఎక్కడో ఒక బ్రాంచీలో వచ్చిన అక్రమ ర్యాంకులను ఎరగా చూపి బ్రాండ్ పేరుతో లక్షల సంఖ్యలో అడ్మిషన్లు తీసుకునే దగాకోరు కార్పొరేట్ కి స్వస్తిపలకాలి. ఇంటర్ అడ్మిషన్లు ఆన్ లైన్ లో జరిపి, ఒక పేరుతో ఒకే కళాశాల ఉండాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.సరస్వతి నిలయాలను చెరసాలలుగా మార్చి విద్యార్థులను నానా అవస్థలు పెడుతూ వేల కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది. నారాయణ డీన్ జయసింహరెడ్డి సెక్స్ కుంభకోణాన్ని, గురుకుల పాఠశాలలో ముక్కుపచ్చలారని దళిత బాలిక పై  దామోదర్ అఘాయిత్యాన్ని బయటపెడితే ఒక్క చర్య తీసుకోకపోగా బయటపెట్టిన ఏబీవీపీ నాయకులపై కేసులు బనాయించి వేదిస్తున్నరు. నయీమ్ కేసు, డ్రగ్స్ మాఫియా కేసు ఇతర కేసులను మూసివేసినంత ఈజీగా ఎంసెట్ కుంభకోణాన్ని  మూసివేయలేవని, అసలు దోషులకు శిక్ష పడే వరకు ఏబీవీపీ ఉద్యమిస్తుందని హెచ్చరిస్తోంది.శ్రీచైతన్య, నారాయణ ల నీతిమాలిన చర్యలకు బలియైన 1000 మంది తెలుగు బిడ్డల సాక్షిగా విద్యా వ్యవస్థలో విలువలను ధ్వంసం చేసిన కార్పొరేట్ విధ్వంసమే ధ్యేయంగా ఏబీవీపీ ఉద్యమిస్తది అని ఘంటా పథంగా చెబుతుంది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు  మహేందర్,  సాయిబాబా, ప్రవీణ్ రెడ్డి, ఎల్లస్వామి, శ్రావణ్, సుమన్, ఆనంద్, మహేష్, సహజాది, అవినాష్, శ్రీశైలం, అంజి,ప్రవీణ్, శరత్, మనోహర్ రెడ్డి, రమేష్, నరేందర్, సురేష్, వినయ్, రాజేష్, అనిల్, చారీ, తదితరులు పాల్గొన్నారు.  అక్రమంగా అరెస్టు చేసిన  రాష్ట్ర కార్యదర్శి ని మరియు ఈ రోజు అరెస్ట్ చేసిన  7 నాయకులను వెంటనే వదిలిపెట్టాలని లేనియెడల రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తీవ్రతరం చేయాల్సి వస్తుంది అని ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ మట్ట. రాఘవేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
ఎంసెట్ లీకులో అసలైన సూత్రధారులు వెంటనే అరెస్టు చేయాలిhttps://www.telugumuchatlu.com/the-original-avant-garde-in-eamet-leak-should-be-arrested-immediately/
Tags: The original avant-garde in EAMET leak should be arrested immediately

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *