Natyam ad

స్కాం కి మొత్తం సూత్రధారి అశోక్ లీలాండే-జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం ముచ్చట్లు:


ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ డీ అటాచ్ మెంట్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు.ఈ డీ అనేది పెద్ద సంస్థ ఈ కేసు గురించి నేను మాట్లాడకూడదు. నిన్న ఈ డీ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ చూసి చాలా ఆనందంగా ఉంది. ముందు నుంచి నేను పోలీసులు, అధికారులను అడిగినా అశోక్ లైలండ్ ను కేసు లో పెట్టలేదు. మొత్తం స్కాం రూ. 38.36 కోట్లు అని ఈ డీ ప్రెస్ నోట్ లో రాసింది. సుమారు రూ. 33 కోట్ల వరకు వైట్ మనీ  అశోక్ లీలాండ్ కంపెనీకి, టాక్స్ లకి కట్టాం. కేసు లో అశోక్ లీలాండ్ పాత్ర పై విచారిస్తాం అని ఈ డీ ప్రెస్ నోట్ లో పేర్కొంది. స్కాం కి మొత్తం సూత్రధారి అశోక్ లీలాండే. ఈ కేసు లో అశోక్ లీలాండ్ తో పాటు  ఆర్టీఏ అధికారులు, నాగాలాండ్ అధికారులు ఉన్నారు.  ఇటీవలే హైకోర్టు ఆదేశాల తో అన్ని వాహనాలను రిలీజ్ చేశారని వివరణ ఇచ్చారు.

 

Tags; The overall mastermind of the scam was Ashok Leelande-JC Prabhakar Reddy

Post Midle
Post Midle