పబ్‌జి మొబైల్ గేమ్‌ను బ్యాన్ చేయాలని చూస్తున్నాయి

The Padji mobile game is looking to be banned
Date:24/04/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
మోస్ట్ పాపులర్ స్మార్ట్‌ఫోన్ గేమ్ ఏది అంటే అందరూ చెప్పే పేరు పబ్‌జి. అయితే ఇటీవల కాలంలో ఈ గేమ్ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. చాలా దేశాలు పబ్‌జి మొబైల్ గేమ్‌ను బ్యాన్ చేయాలని చూస్తున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. నేపాల్‌లో పబ్‌జి గేమ్‌పై నిషేధం విధించిన విషయం తెలసిందే. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సూచనల మేరకు నేపాల్ టెలీ కమ్యూనికేషన్స్ అథారిటీ (ఎన్‌టీఏ) ఏప్రిల్ 11న పబ్‌జి మొబైల్ బ్యాన్ చేయాలని ఐఎస్‌పీఎస్, మొబైల్ ప్రొవైడర్లు, నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. అయితే తాజాగా ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ అక్కడి సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈశ్వర్ ప్రసాద్ ఖతివాడా ఈమేరకు తీర్పును వెలువరించారు. ‘పబ్‌జి మొబైల్ అనేది ఒక గేమ్ మాత్రమే. దీన్ని వినోద మధ్యమంగా చూడాలి’ అని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు అలాగే పబ్‌జి మొబైల్ బ్యాన్‌ చేస్తూ ఖాట్మాండ్ డిస్ట్రిక్ట్ కోర్టు జారీ చేసిన ఆర్డర్‌పై స్టే విధించింది. నేపాల్ అత్యున్నత న్యాయస్థానం అక్కడి ప్రభుత్వానికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘పబ్‌జి అనేది ఒక గేమ్. ప్రజలు వినోదం కోసం ఈ గేమ్ ఆడుతున్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది రాజ్యంగం అందిరికీ కల్పిస్తున్న హక్కు. గేమ్‌పై నిషేధం విధిస్తే.. ఎందుకు అలా చేశారో సరైన వివరణ ఉండాలి. ఆమోదయోగ్యమైన కారణం చూపాలి. అధికారుల చర్య సరైనదిగా, సమర్థనీయంగా కనిపించాలి’ అని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. ఏప్రిల్ 10న ఖాట్మాండ్ కోర్టు విధించిన బ్యాన్ ఆమోదయోగ్యంలేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.ఇకపోతే పబ్‌జి గేమ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. పిల్లలపై పబ్‌జి గేమ్ వల్ల ప్రతికూల ప్రభావం పడుతోందని కొందరు చెబుతుంటే.. పిల్లలు పబ్‌జి గేమ్‌ని సీరియస్‌గా తీసుకుంటున్నారని, పబ్‌జి ఆడటం వల్ల వీళ్లలో హింసాత్మక ప్రవర్తన పెరుగుతోందని మరికొందరు పేర్కొంటున్నారు. పబ్‌జి గేమ్‌కు పిల్లలు, యువత బానిసలుగా మారుతున్నారని, సరిగా చదువు కోవడం లేదని ఇంకొద్దరు ఫిర్యాదు చేస్తున్నారు.
Tags:The Padji mobile game is looking to be banned

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *