ప్రజల మానసిక ఉల్లాసం కోసమే పార్కు

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణ ప్రజలు మానసిక ఉల్లాసంతో ఉండేందుకే కోటిరూపాయలతో పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. శనివారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌ తో కలసి పట్టణంలోని సాయిబాబాగుడి వెనుక నుంచి కోనేటిపాళ్యెం వరకు చెరువు కట్టపై పార్కు ఏర్పాటు పనులు చేపట్టారు. ఈ ప్రాంతంలో వాకింగ్‌ట్రాకు, విద్యుత్‌ దీపాలు, వెహోక్కలు నాటేందుకు భూమిని చదును చేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ పుంగమ్మ చెరువు కట్టపై పార్కు ఏర్పాటు చేసేందుకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోటి రూపాయలు మంజూరు చేశారని, ఈ నిధులతో సుందరమైన పార్కును సిద్దం చేస్తామన్నారు. పట్టణ ప్రజలకు అనుకూలంగా ఉండేలా ప్లాను తయారు చేసినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో డీఈఈ మహేష్‌, కౌన్సిలర్‌ అమ్ము తదితరులు పాల్గొన్నారు.

 

Tags: The park is for the mental relaxation of the people

 

Leave A Reply

Your email address will not be published.