ఒంటరిగానే ఒంటిచేత్తో పార్టీని నెట్టుకురావాలి

The party alone must be alone with the same

The party alone must be alone with the same

Date:14/03/2019
చెన్నై ముచ్చట్లు:
దాదాపు ఎనిమిదేళ్ల నుంచి అధికారం లేదు. వ్యూహాలు రచించగల తండ్రి అండలేదు. ఒంటరిగానే ఒంటిచేత్తో పార్టీని నెట్టుకురావాలి. మరోవైపు సోదరుడి నుంచి కొంత ఇబ్బంది పడే ప్రమాదముంది. ఇప్పుడు స్టాలిన్ ఎదుర్కొంటున్న సమస్య ఇదే. రజనీకాంత్ ప్రస్తుత ఎన్నికలకు దూరంగా ఉండటం తమకు కొంత మేలు చేకూరుతుందని డీఎంకే అధినేత స్టాలిన్ భావిస్తున్నారు. అయితే కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ తో ఎవరికి దెబ్బ పడుతుందనేది ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న.ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో స్టాలిన్ సోదరుడు ఆళగిరి వ్యవహారంపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.
డీఎంకే కూటమి పార్టీలతో బలంగా కన్పిస్తుంది. జాతీయ మీడియా సర్వేలు కూడా స్టాలిన్ కు అనుకూలంగానే వస్తున్నాయి. కాంగ్రెస్, మిగిలిన పార్టీల మద్దతుతో గత ఎన్నికలలో జీరోసాధించిన ఫలితలను డబుల్ డిజిట్ కు చేర్చాలన్నది స్టాలిన్ ప్రయత్నం. లోక్ సభ ఎన్నికలతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటం కూడా స్టాలిన్ కు సవాల్ గా మారింది.మొత్తం 18 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలలో కనీసం 12 స్థానాలను గెలుచు కోవాలన్న లక్ష్యంతో స్టాలిన్ ఉన్నారు.
ఇక అధికార అన్నాడీఎంకే పార్టీ కూడా అధికారం కోల్పోకుండా ఉండాలంటే ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది.  తమిళనాడు లో ప్రభుత్వం అధికారంలో ఉండేందుకు మ్యాజిక్ ఫిగర్ 118. అయితే ఇప్పటి వరకూ అధికార అన్నాడీఎంకే సభ్యుల సంఖ్య చూసుకుంటే 113 మాత్రమే. డీఎంకేకు తన మిత్ర పక్షాల పార్టీలతో కలిపి 97 మంది ఉన్నారు. కేవలం తేడా ఆరు మాత్రమే. ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే కనీసం ఐదు స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. లేకుంటే పళనిస్వామి, పన్నీర్ సెల్వం ప్రభుత్వం దిగిపోక తప్పదు. స్టాలిన్ ఉప ఎన్నికలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.
టీటీవీ దినకరన్ పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగుతుంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలంతా దినకరన్ వర్గానికి చెందిన వారే కావడంతో ఆయన కూడా ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంగానే పావులు కదుపుతున్నారు. ఉప ఎన్నికల్లో డీఎంకేకు ఎక్కువ స్థానాలు వచ్చి, ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా అవసరమైతే దినకరన్ మద్దతు కూడా స్టాలిన్ కే ఉంటుందంటున్నారు. మొత్తం మీద ఎనిమిదేళ్ల తర్వాత కలసి వస్తున్న ఎన్నికలను స్టాలిన్ ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాల్సి ఉంది.
Tags:The party alone must be alone with the same

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *