అధికార పార్టీకి అనుకున్నంత వీజీ కాదు

The party is not a vested party

The party is not a vested party

కత్తి మీద సాములా ఖర్చు
Date:08/10/2018
వరంగల్  ముచ్చట్లు:
రాష్ట్రంలో పోలింగ్‌ తేదీకి సరిగ్గా రెండు నెలల సమయం ఉంది. ఇది ఒకవైపు అభ్యర్థులకు కలిసొచ్చే అంశమే. మరోవైపు ఇది వారిపై తీవ్ర ఒత్తిడిని పెంచే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగడం కొంతవరకు కత్తిమీద సామే. అభ్యర్థులంతా గ్రామాల వారీగా కీలకంగా ఉండే క్షేత్రస్థాయి నాయకులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రజల్లోకి వెళితే వారిని ఆకట్టుకోవడానికి వీలవుతుంది. ఈ దిశగా ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ద్విచక్రవాహన ర్యాలీలు మొదలు గ్రామస్థాయిలో జరిగే సమావేశాల వరకు భారీగానే ఖర్చు వెచ్చించాల్సి ఉంటుంది.
ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు వ్యయ నియంత్రణ చేసుకుంటూ ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి. రెండు నెలల సమయం ఉండటంతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే వారి సంఖ్య సైతం పెరగడానికి అవకాశముంది. షెడ్యూలు నుంచి పోలింగ్‌ తేదీ ముగిసే వరకు ఎప్పుడు ఏం జరుగుతోందనన్న ఆందోళన అభ్యర్థులకు కునుకు పట్టనీయదు. ఈ రెండు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగితే ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికీ వీలుంటుంది.ఓటర్లతో ముఖ్య కార్యకర్తలు మొదలు, కీలక నేతలందరితోనూ ఈ రెండు నెలలు సత్సంబంధాలు నెరపాల్సి ఉంటుంది.
మరో వైపు టీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ఊపందించారు. గ్రామగ్రామాన తిరుగుతున్నారు. రెండు నెలలపాటు అదే ఉత్సాహంతో కొనసాగించాల్సి ఉంది. తెరాస అభ్యర్థులతో పాటు… టిక్కెట్‌ తమకే దక్కుతుందని బలంగా విశ్వసిస్తున్న కాంగ్రెస్‌ నేతలూ సైతం ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెరాస అభ్యర్థుల ప్రకటన అనంతరం చాలాచోట్ల ఆశావహులు కినుక వహించారు. కొందరు పార్టీనే వీడారు.
ఇక అన్ని పార్టీల అభ్యర్థులెవరనేది తేలితే ఆయా పార్టీల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తే అవకాశాలుంటాయి. అందుకే విడతల వారీగా టికెట్లు కేటాయించే వ్యూహాన్ని విపక్ష పార్టీలు అనుసరిస్తున్నాయి. నవంబరు 12న ఎన్నికల ప్రకటన వెలువడనుంది. అదేనెల 19తో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగుస్తుంది. అప్పటి వరకు కూడా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా వేచి చూసే ధోరణి ప్రదర్శించే వీలుందని విపక్ష పార్టీలకు చెందిన నేతలు వివరిస్తున్నారు.
Tags:The party is not a vested party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *