పార్టీ మారేది లేదు : రేపల్లె ఎమ్మెల్యే

Date:27/06/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. రాజ్యసభ ఎంపీలతో చేరికలు మొదలు పెట్టిన బీజేపీ.. వరుసగా నేతల్ని పార్టీలోకి లాగేస్తోంది. తెలుగు దేశంలో పెద్ద తలకాయలతో పాటూ ఎమ్మెల్యేలను లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలతో కాషాయదళం టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈలోపు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలిశారని జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ మారడం ఖాయమని వార్తలు చక్కర్లు కొట్టాయి. పార్టీ మారతారంటూ వస్తున్న వార్తలపై అనగాని సత్యప్రసాద్ ఎట్టకేలకు స్పందించారు. తాను వ్యక్తిగత పనులుపై ఢిల్లీ వచ్చానని క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తానున ఏ బీజేపీ నేతని కలవలేదని.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను కలిసినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. ఆయన్ను కలిసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తాను వ్యక్తిగత పనులపై ఢిల్లీ వచ్చానన్నారు సత్య ప్రసాద్. చంద్రబాబు నివాసంలో సమావేశం ఉందని తనకు సమాచారం అందిందని అనగాని చెప్పారు. రెండు రోజులు తాను ఢిల్లీ వెళుతున్నట్లు అధినేతకు సమాచారం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసన్నారు. ఎంపీ గరికపాటి మోహన్‌రావు తనకు ఆప్తుడని.. అనారోగ్యంతో ఉన్న ఆయన్ను పరామర్శించానన్నారు. అంతేగాని ఆయనతో కలిసి బీజేపీ నేతల్ని కలిశానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం కాదన్నారు. అయినా ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం సరికాదని.. తాను అలాంటి వ్యక్తిని కాదన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆదరించలేదని.. ఏపీకి బీజేపీకి అన్యాయం చేసిందనే భావన ప్రజల్లో ఉందన్నారు సత్య ప్రసాద్. అందుకే ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారని.. ఇటు వైసీపీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.

 

ప్రముఖుల దిగ్భ్రాంతి

 

Tags: The party is unchanged: Rappalle MLA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *