Date:02/10/2020
వరంగల్ ముచ్చట్లు
గాందీ జయంతి సందర్బంగా స్టేషన్ రోడ్ లోని పోచమ్మ గుడి వద్దగల మహాత్మా గాంది విగ్రహానికి తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,ఎంపి బండా ప్రకాశ్ ముదిరాజ్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ శాంతియుత, అహింసా మార్గంలో భారత స్వాతంత్ర ఉద్యమాన్ని గాంధీజీ నడిపారని అన్నారు. వారు చూపిన మార్గం ఆదర్శనీయం,ఆచరణీయమని తెలంగాణాలో గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. గాందీ చూపిన మార్గంలో నడుస్తూ తెలంగాణాను ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే అభివృద్దిలో ముందుంచారన్నారు. మహాత్మా గాంధీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..
Tags:The path shown by the Mahatma is ideal