ప్రైవేటు ఆసుపత్రిలో రోగి మృతి

-బంధువుల అందోళన
రంగారెడ్డిముచ్చట్లు:
 
సైదాబాద్ డివిజన్ పరిధిలోని నైటింగేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన లక్ష్మీ పతి నాయక్ (55) విషయమై మృతుడి బంధువులు, కుమారులు గురువారం నాడు ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే  సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ లక్ష్మీపతి నాపయక్  కీ చాతీలో మంట రాగా సమీపంలోని నైటింగేల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం బుధవారం సాయంత్రం తీసుకురాగా పరీక్షలు నిర్వహించి లంగ్సులో నీరు వచ్చిందని ఆపరేషన్ చేసి తోలగించాలని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. బంధువులు చికిత్స చెయ్యమని చెప్పి ఫీజులు చేల్లించండంతో ఆపరేషన్ కు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు, బంధువర్గాలు తెలిపాయి. కాగా, ఆసుపత్రిలో చికిత్స సమయంలో వేసిన ఇంజక్షన్ వికటించడంతో గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు బంధువులకు తెలిపారు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబీకులు వారి బంధువులు ఆసుపత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన వారి బంధువులు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తమ వ్యక్తి మృతి చెందారని ఒరోపిస్తూ ఆందోళన కు దిగారు. ఈ విషయమై అటు పోలిసులను, ఇటు ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించాలని చూడగా వారు  వివరాలను తెలపడానికీ నిరాకరించారు  ఈ సందర్భంగా బందువుల నుండి ఆసుపత్రి సిబ్బందికి రక్షణ కల్పిస్తూ పోలిస్ స్టేషన్ సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం, బందువుల ను కనీసం మృతదేహాన్ని చూడనియ్యక పోవ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకోంది. మృతుని కుటుంబీకులు ,బంధువులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైదాబాద్ పోలీసులు తెలిపారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
 
Tags:The patient died at a private hospital

Leave A Reply

Your email address will not be published.