రైతు  రాజ్యం జగనన్నతోనే సాధ్యం

ఎమ్మెల్యే ఆర్థర్ తొగురు

పాములపాడు ముచ్చట్లు:

 

పాములపాడు మండలం బానకచర్ల గ్రామం లో నూతనంగా నిర్మించబడుతున్న రైతు భరోసా కేంద్రం మరియు  వైయస్సార్ హెల్త్ సెంటర్లకు  భూమి పూజ చేశారు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తొగురు  ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూరాష్ట్రంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నల శ్రేయస్సే పరమావధిగా భావించి పని చేస్తున్నారని అన్నారు సకాలంలో వర్షాలు కురవడం, సాగునీటి ఇబ్బందులు లేకుండా రైతులు పంటలు పండించుకోవడం చూస్తుంటే “రాజన్న రాజ్యం- జగనన్నతోనే సాధ్యం” అనే నినాదం నిజమైంది. అని అన్నారు రాజశేఖర్ రెడ్డి  మరణానంతరం వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట అవినీతికి పాల్పడి, నకిలీ మోటార్లు బిగించి రైతాంగానికి తీరని ద్రోహం చేశారు.రైతుల అభివృద్ధికి, రైతాంగం శ్రేయస్సు కొరకు, రైతుల సంక్షేమం కోసం పని చేస్తాను అని అన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి, మేలైన వసతులు కల్పించడంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పాతపడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నూతన భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నారు అని ఎమ్మెల్యే ఆర్థర్ తొగురు  అన్నారు.

 

 

ఈ కార్యక్రమంలో భాగంగా స్థల ధాత శ్రీ చిలకల లింగా రెడ్డి ని గౌరవ ఎమ్మెల్యే  సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్  వంగాల భరత్ కుమార్ రెడ్డి , వడ్డెర కార్పొరేషన్  డైరెక్టర్  రామ సుబ్బయ్య , ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ ఆవుల నారాయణరెడ్డి , భానకచర్ల గ్రామ సర్పంచ్  ఆవుల జయసుధ గారు, తహసిల్దార్  గోపాల్ , మండల అభివృద్ధి అధికారి  రానెమ్మ,  పంచాయతీరాజ్ డిఇ శ్రీ రవీంద్ర రెడ్డి , ఈవో ఆర్ డి , మండల వ్యవసాయ అధికారి  ఫణీశ్వర్ రెడ్డి , ఎం.ఈ.ఓ బాలాజీ నాయక్, పాములపాడు వైఎస్సార్సీపీ మండల నాయకులు  ముడియాల. శ్రీనివాస్ రెడ్డి , ముర్తుజావలి, బంగారం మౌలాలి ,రమణారెడ్డి , సర్పంచ్ మౌలాలి, ఇతర సంబంధిత అధికారులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: The peasant kingdom was possible only with Jagannath

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *