Natyam ad

కలం యోధుడు పిట్టల రాజేందర్ ఇకలేరు

రామగుండం ముచ్చట్లు:

కలం యోధుడు అక్షర గురువు, సీనియర్ పాత్రికేయులు గోదావరిఖని ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు పిట్టల రాజేందర్ (68) మంగళవారం అర్ధరాత్రి అకాల మరణం చెందారు. ఆయన మరణవార్త విన్న పెద్దపల్లి జిల్లా సీనియర్ జర్నలిస్టులు, గోదావరిఖని ప్రెస్ క్లబ్ పాత్రికేయులు పలువురు సంతాపం  వ్యక్తం చేశారు. పిట్టల రాజేందర్ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించి పిట్టల రాజేందర్ కి నివాళులర్పించారు. నమ్మిన సిద్ధాంతం కోసం, ఎన్ని ఆటు, ఫోటులు, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ నిక్కచ్చిగా నిర్భయంగా నిజాలు వెలికి తీసే అటువంటి జర్నలిజాన్ని నమ్ముకుని ఎంతోమంది విద్యార్థులకు అక్షరాలు నేర్పిన గోదావరిఖని ప్రాంత అక్షయ గురువు పిట్టల రాజేందర్ చివరి దాకా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. పిట్టల రాజేందర్ లాంటి వారు నేడు సమాజానికి ఎంతో అవసరం. వారి మరణం సమాజానికి ఎంతగానో తీరని లోటు. వారు భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు మన ముందే ఉన్నాయి. వారి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మరొక్కసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నామన్నారు.

 

Tags: The pen warrior Pittala Rajender is no more

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.