Natyam ad

జగన్‌ పాలనతోనే కుప్పం ప్రజల్లో మార్పు-ఎంపీ, లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి

-ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత
-కుప్పం సీఎం సభే నిదర్శనం

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యుమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనతో కుప్పం నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్షనేత పీవీ.మిథున్‌రెడ్డి అన్నారు. ఆదివారం పుంగనూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 14ఏళ్లు సీఎంగా చంద్రబాబు కుప్పానికి ఏమిచేయలేదన్న విషయం శుక్రవారం జరిగిన సీఎం సభ నిదర్శనంగా నిలిచిందన్నారు. రాజకీయ సభలకు జనం తరలించాల్సి వచ్చేది, కుప్పం సీఎం సభకు ఆ పరిస్థితి కలగలేదు, దానికి కారణం ఈ నియోజకవర్గంలో ప్రతిఇంటికి సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేసిన సంక్షేమ ఫలాలు అందడం వల్లేనని అన్నారు. సభ ప్రారంభమై, ముగిసేదాక హజరైన మహిళలు కదలకపోవడం, దారిపొడవున వేలాది మంది సీఎంకు స్వాగతం పలకడం చూస్తే మహిళల్లో సీఎంకు ఎంత ఆదరణ ఉందో అర్థమైందన్నారు. చంద్రబాబు హయాంలో జరగని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు ఇప్పుడు జరుగుతోందని, కుప్పం ప్రజలు కళ్లారా చూస్తున్నారని అన్నారు. కుప్పం అభివృద్ధిని చంద్రబాబునాయుడు పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలారు ప్రాజెక్టు అభివృద్ధి చేపట్టారన్నారు. హంద్రీనీవా కాలువ నీటిని కుప్పంకు విడుదల చేయడం, మున్సిపాలిటి అభివృద్దికి కోట్లాది రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందన్నారు.

 

 

అలాగే కుప్పంలో ఆర్‌డీవో ఆఫీసును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చంద్రబాబునాయుడు అందించలేని సంక్షేమ పథకాలను కుప్పం నియోజకవర్గ ప్రజలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిందన్నారు. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబునాయుడు తిరిగినా ప్రజలు పట్టించుకోకుండ , ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మీద నమ్మకంతో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులుగా 85 శాతం ఎన్నికైయ్యారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించామని, అసెంబ్లి ఎన్నికల్లోను కుప్పం ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, విజయం వైఎస్సార్‌సీపీదేనని స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాలతో ఆర్థికాభివృద్ది సాధిస్తున్న కుప్పం ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ఆదరించినట్టే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ మార్పు కోరుకొంటున్నారని, కుప్పంలో విజయం సాధించి తీరుతామని తెలిపారు. ఈ సమావేశంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే నవాజ్‌బాషా, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags: The people of Kuppam have changed only with Jagan’s rule-MP and Lok Sabha Party leader Mithun Reddy

 

Leave A Reply

Your email address will not be published.