కమిషనర్ దర్శనమే కరువవుతుందన్న సింహపురి ప్రజలు

-ఎల్లవేళలా కమిషనర్ చైర్ ఖాళీగా దర్శనం
-టిడిపి మహిళా నేతల ఆరోపణ

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు నగర కమిషనర్ ఎప్పుడు కార్యాలయానికి వస్తారో ఎప్పుడు వెళ్తారో కూడా అర్థం కాకుండా తయారైందని టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తాళ్లపాక అనురాధ విమర్శించారు. నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం గతంలో కమిషనర్లు నిరంతరం పనిచేశారని కానీ ప్రస్తుత కమిషనర్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. ఎంతోమంది పేద ప్రజల అర్జీలు చేత బట్టుకొని చాంబర్ వద్ద  పడిగాపులు కావలసిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నగర కార్పొరేషన్ లో పరిపాలన పూర్తిస్థాయిలో స్తంభించింది అన్నారు ఇక 7 నెలల క్రితం కార్పోరేటర్లుగా గెలుపొందిన వారు కార్పొరేషన్ కు వెళ్లడమే మానివేశారన్నారు. కార్పొరేషన్ లో ఏడాదికి 872 కోట్ల బడ్జెట్ ఉందని కనీసం ఎన్ని కోట్ల బడ్జెట్ ఉంది కూడా ప్రస్తుత కార్పొరేటర్లకు తెలియదన్నారు. కార్పొరేషన్ లో ప్రతిపక్షం లేకపోవడంతో కనీసం ప్రశ్నించేవారు కూడా లేకుండా పోయారన్నారు. అభివృద్ధి పనులు చేయలేక ప్రతిపక్షం పై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ సైలేంద్రబాబు విజయమ్మ, సాబీర్ ఖాన్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

 

Tags: The people of Simhapuri say that the Commissioner’s visit will be scarce

Leave A Reply

Your email address will not be published.