ఉప్పల్ ప్రజలకు సహాయం అందలేదు

Date:22/10/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

వరద బాధితుల కోసం కేసీఆర్ ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ప్రకటించారు కానీ ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లో వరదల్లో మునిగిపోయిన వారికి ఎలాంటి సహాయం అందలేదని జనసమితి పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఇన్చార్జి కొత్త మల్లారెడ్డి అన్నారు. ఈరోజు కొత్త మల్లారెడ్డి సొంత ఖర్చుతో 300 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లాపూర్ డివిజన్ లో పదివేల రూపాయల సహాయనిధి ఎవరికి అందరిదీ అని చెప్తున్నారు స్థానికంగా ఉన్న కార్పొరేటర్ అధికారులు కూడా స్పందించడం లేదు స్థానిక ప్రజలు చెబుతున్నారు రేషన్ మరియు పెన్షన్ లు సరిగా రావడం లేదని చెప్తా ఉన్నారు కాబట్టి వారికి సకాలంలో పదివేల రూపాయలు సీఎం కిట్టు అందేలా చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాజు ముదిరాజ్, మహేందర్ గౌడ్, మల్లేష్, జితేంద్ర, వెంకట్ రెడ్డి , కార్తిక్ , సాయి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

చంద్ర‌ప్ర‌భ వాహ‌నంపై న‌వ‌నీత కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

Tags: The people of Uppal did not receive help

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *