The people who attended the response

The people who attended the response

– మున్సిపాలిటిలో 495 వినతులు

Date:22/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ప్రజలు తమ సమస్యల కోసం అర్జీలతో హాజరైయ్యారు. పుంగనూరు మున్సిపాలిటిలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ , ఆర్‌వో రామక్రిష్ణ , మేనేజర్‌ రసూల్‌ఖాన్‌ ఆధ్వర్యంలో అన్నిశాఖల అధికారులు కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బాగంగా పట్టణ ప్రజలు 495 మంది హాజరై, తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. అర్జీదారులకు మున్సిపల్‌ కమిషనర్‌ రశీదులను అందజేశారు. అలాగే మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మిపతినాయుడు , ఈవోఆర్‌డి వరప్రసాద్‌ కలసి వినతులు స్వీకరించారు. అలాగే తహశీల్ధార్‌ కార్యాలయంలో తహశీల్ధార్‌ వెంకట్రాయులు , డిప్యూటి తహశీల్ధార్‌ మాదవరాజు ఆధ్వర్యంలో వినతిపత్రాలు స్వీకరించారు. 15 ఫిర్యాదులు అందాయి. కాగా ఎంపీడీవోకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.

మార్కెట్‌ కమిటిలో పాత పద్దతిని కొనసాగించాలంటు రైతులు ధర్నా

Tags: The people who attended the response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *