జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

-కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఎండి  ఖుతుబొద్దిన్ పాషా
కోరుట్ల  ముచ్చట్లు:
 
సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ మెట్ పెల్లి పట్టణ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. సోమవారం మెట్ పెల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖర్లు సమావేశంలో ఆయన మాట్లాడారు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జర్నలిస్టులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతూ ఉండటం బాధాకరమన్నారు. ఇందులో ఎక్కువగా అధికారపార్టీకి చెందిన నాయకులు దాడులకు పాల్పడుతున్నరని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు చేసే అరాచకాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నా జర్నలిస్టులను దాడులతో భయపెడుతున్నారన్నారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నప్పటికీ దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల సంక్షేమానికి, వారికి అవసరమైన రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ పై జరుగుతున్న దాడులను ఇప్పటికైనా ప్రోత్సహించడం మానుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ముత్తిబ్ రహమాన్ ,మదర్ ఖాన్, ముజ్జు, శివ ,జుబేర్, రవి  పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: The perpetrators of the attacks on journalists should be severely punished

Natyam ad