నిమ్మనపల్లి ముచ్చట్లు:
నాటు సారా అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిమ్మనపల్లె ఎస్ఐ లోకేష్ రెడ్డి కథనం మేరకు.. వాయల్పాడు మండలం, జర్రాపల్లి వడ్డిపల్లికి చెందిన ఇడగొట్టి రమణ (47) నాటు సారా తయారుచేసి తీసుకొచ్చి నిమ్మనపల్లె మండలంలోని తవలం హరిజనవాడ ప్రజలకు సారా విక్రయిస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారంతో వెల్లి ఆదివారం ఇ. రమణను అదుపులోకి తీసుకుని అతని వద్ద10 లీటర్ల సారా సీజ్ చేశామన్నారు. స్టేషన్ కు తరలించి కేసు నమోదు అనంతరం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Tags; The person selling natu sara was arrested