వ్యక్తి దారుణ హత్య

Date:30/11/2019

ఏలూరు ముచ్చట్లు:

ఏలూరు 3 టౌన్ పోలీసు పరిధిలోని  ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జాతీయరహాదారి బ్రిడ్జి క్రింద ఒక వ్యక్తిని కొందరు దారుణ హత్య చేసారు. నిర్మానుష్యమైన సంఘటనా స్దలంలో బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తలపై తీవ్రగాయాలతో కొన ఊపిరితో ఉన్న వ్యక్తి గురించి సమాచారం అందగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.  బాధితుడిని  ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసు వాహనంలో తరలించారు. తీవ్ర గాయాల పాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతించెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు ఏలూరు రూరల్ తిమ్మారావు గూడెంకు చెందిన గొవ్వాడ కృష్ణ (40).  ఏలూరు ఎస్బీఐ బ్యాంకు మెయిన్ బ్రాంచిలో అవుట్ సోర్సింగ్ స్వీపర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్దలానికి చేరుకున్నల  ఏలూరు డీఎస్యపీ దిలీప్ కిరణ్ పోలీసు సిబ్బంది,  క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ బృందం ఆధారాలు సేకరించారు.

పంచమితీర్థం ప్రాశ‌స్త్యం – ప‌ద్మ‌పుష్క‌రిణి వైశిష్ట్యం

 

Tags:The person was brutally murdered

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *