అంతు చిక్కని జగన్ వ్యూహాం

Date:22/10/2019

విజయవాడ ముచ్చట్లు:

ఏపీ రాజకీయం ఒడిసిపట్టడానికి కమలనాధులు నానా కష్టాలు పడాల్సివస్తోంది. గండరగండడు చంద్రబాబుని ఓడించామనుకుంటే అతని కంటే ఘనుడు అన్నట్లుగా జగన్ తయారయ్యారు. జగన్ నాలుగున్నర నెలల పాలన పట్ల ఏపీలో వ్యతిరేకత అయితే లేదు. జగన్ ఏదో చేస్తున్నాడన్న భావన కలిగించడంలో కొత్త ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విజయవంతం అయ్యారు. జగన్ ఓ పద్ధతి ప్రకారం అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రతీ వర్గానికి సంక్షేమ తాయిలాలు ప్రకటిస్తున్నారు. వారూ వీరు అని చూడకుండా అందరినీ అక్కున చేర్చుకుంటున్నారు. జగన్ రాజకీయ వ్యూహాలు చూస్తున్న బీజేపీ పెద్దలు బిత్తరపోతున్న పరిస్థితి. అనుభవం లేదని అనుకుంటే జగన్ ఆరితేరిపోతున్నారని బీజేపీ కంగారు పడుతోంది. తిట్టిన నోటితోనే పొగడాల్సిరావడం బీజేపీ నేతలకు మింగుడుపడడంలేదురైతు భరోసా పధకానికి తన తండ్రి వైఎస్సార్ పేరుతో పాటు పీఎం కిసాన్ అన్న పేరు కూడా జగన్ జత చేయడంతో ఏపీ బీజేపీ సారధి కన్నా లక్ష్మీనారాయణ సైతం భేష్ అనాల్సివచ్చింది. ఇక ఈ పధకం ద్వారా వచ్చే మంచి పేరు జగన్ కి పోతుంది.

 

 

 

 

 

జత చేసిన పేరుతోనే బీజేపీ సంతోషపడాల్సివుంటుంది. దీంతో బీజేపీ నేతలకు జగన్ ఆలోచనలు అర్ధం కావడంలేదని అంటున్నారు. ఏపీలో పట్టు సంపాదించాలంటే టీడీపీ నేతలు చోటా మోటా తప్ప ఎవరూ చేరడంలేదు. మరో వైపు అదే పనిగా వైసీపీని విమర్శిస్తే అది టీడీపీకి రాజకీయ లాభాన్ని కలిగిస్తుందేమోనన్న భయాలు బీజేపీ నేతలకు ఉన్నాయి. ఆలా అని ఊరుకుంటే రాజకీయ మైదానం నుంచి ఉనికి లేకుండా డకౌట్ అయ్యే పరిస్థితి. మొత్తానికి బీజేపీ బాధ వర్ణించరానిదేనని అంటున్నారు.ఏపీలో చంద్రబాబు పెరగకూడదు, ఇదీ కమలనాధుల వ్యూహం. ఎందుచేతంటే చంద్రబాబు ఎంత పెరిగితే అంతలా ఢిల్లీకే ఆ రాజకీయ సెగ తగులుతుంది కాబట్టి. దేశంలోని సీనియర్ నాయకులలో ఒకరైన చంద్రబాబు ఏపీలో బలం పుంజుకుంటే ఆయన నేరుగా ఢిల్లీ వైపే గురి పెడతారు. దాంతో మోడీ, షాలకే ఇబ్బంది అవుతుంది.

 

 

 

 

 

అందువల్ల ఆయన అలా ఓడిపోయిన ముఖ్యమంత్రిగానే ఉండాలని బీజేపీ వ్యూహకర్తలు కోరుకుంటున్నారు. ఇక మరో వైపు జగన్ ని కట్టడి చేయడానికి కేంద్ర స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు మళ్లీ టీడీపీకే వూపిరి పోసేలా కనిపిస్తున్నాయి. మరోవైపు కేంద్రం నుంచి నిధులు విడుదల చేయకపోయినా జగన్ ఉన్న బడ్జెట్లో అభివృధ్ధి పక్కన పెట్టి సంక్షేమానికే మొత్తం కేటాయింపులు చేస్తున్నారు. ఇది పక్కా రాజకీయ వ్యూహం .దాన్ని తట్టుకోవడానికి బీజేపీ దగ్గర కొత్త ఎత్తుగడలు కూడా లేవు. ఇపుడున్న పరిస్థితుల్లో ఇటు బాబును, అటు జగన్ ని ఇద్దరినీ ఒకేమారు కట్టడి చేయడం అంటే బీజేపీకి కత్తి మీద సామే మరి. అందుకే బీజేపీ రాజకీయ బలం ఎంత పెరిగింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందిట.

అమిత్ షా రాకతో ఏపీలో మార్పులు.

Tags: The pic strategy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *