గులాబీ పార్టీకి ఎన్టీఆరే కావాలి….

The pink party needs an NTR ....

The pink party needs an NTR ....

 Date:15/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ముందస్తు వ్యూహాన్ని ఎంచుకుని మిగతా పార్టీలకు సవాల్ విసిరారాయన. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో పార్టీలన్నీ స్పీడు పెంచేశాయి. అసెంబ్లీని రద్దు చేసిన రోజే ఊహించని స్థాయిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో మిగతా పార్టీలు కూడా అదే పనిలో నిమగ్నమయ్యాయి. అభ్యర్థుల ఖరారులో తల మునకలై ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా క్రెడిట్ సాధించలేకపోయిన కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. దీంతో ఈ సారి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొందరు కీలక నేతలు పార్టీకి దూరమైనా.. ఇతర పార్టీల నుంచి కొందరు నేతలను తమ పార్టీలోకి రప్పించుకోవడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయింది. అలాగే ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుని ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తోంది. అయితే, ఒంటరిగా వెళ్తే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నదని గ్రహించిన ఆ పార్టీ, ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధమని ప్రకటించింది. దీంతో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు తెరపైకి వచ్చింది.
, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పొత్తుపై దాడిని ప్రారంభించింది.  కేటీఆర్ ‘‘తెలంగాణను అడ్డుకున్న రెండు గడ్డాలు (ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు) ఏకమవుతున్నాయి. కాంగ్రెస్-తెలుగుదేశం పొత్తుపెట్టుకోవడం తనకు సంతోషం కలిగిస్తోంది. ఎన్నికల్లో ఈ ఇద్దరినీ వేర్వేరుగా కాకుండా కలిపి కొట్టే అవకాశం లభిస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను బొందపెట్టడానికే నాడు ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని.. అటువంటి పార్టీని కాంగ్రెస్ కు తోక పార్టీగా మార్చిన ఘనత మాత్రం చంద్రబాబుకే దక్కుతుంది’’ అని ఎద్దేవా చేశారు.
ఆయన కామెంట్స్‌లో తెలుగుదేశం పార్టీని ఆంధ్రోళ్ల పార్టీ అంటూ విమర్శించి.. దానిని స్థాపించిన ఎన్టీఆర్‌ను మాత్రం పొగిడాడు. దీనిని బట్టి చూస్తే.. ఆయన ఎన్టీఆర్‌ను వాడుకోవాలని చూస్తున్నారని, తద్వారా టీడీపీకి అనుకూలంగా ఉన్న సెటిలర్ల ఓట్లను లాక్కొవచ్చేనే ఆలోచనలో టీఆర్ఎస్ ఉన్నదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కేటీఆర్ కామెంట్స్ చూసిన టీడీపీ అభిమానులు ఆయనపై ఫైర్ అవుతున్నారు. టీడీపీ వద్దు కానీ.. ఆ పార్టీకి మద్దతుగా ఉన్న వాళ్ల ఓట్లు మాత్రం కావాలా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Tags:The pink party needs an NTR ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *