గోతుల‌ను వెంట‌నే పూడ్చాలి

Date:22/06/2020

విశాఖపట్నం  ముచ్చట్లు:

విశాఖ న‌గ‌రంలో అండ‌ర్ గ్రౌండ్ ప‌నుల నిమిత్తం గ‌తంలో త‌వ్వి అంస‌పూర్తిగా విడిచిపెట్టేసిన గోతుల‌ను వెంట‌నే పూడ్చివేసి ప్ర‌జారోగ్యానికి దోహ‌ద ప‌డాల‌ని బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ సభ్యులు డాక్ట‌ర్ కె.వి.వి.స‌త్య‌నారాయ‌ణ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు బీజేపీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ   అండ‌ర్ గ్రౌండ్ ప‌నుల నిమిత్తం గ‌త సంవ‌త్స‌రం నుంచి గోతులు త‌వ్వేసి అలానే విడిచిపెట్టేశార‌ని పేర్కొన్నారు. దానివ‌ల్ల చిన్న‌పిల్ల‌లు వాటిలో ప‌డిపోతూ గాయాల పాల‌వుతున్నార‌ని, అదేవిధంగా వాహ‌న చోధ‌కులు మెడ‌, వెన్నెముక వంటి నొప్పుల బారిన ప‌డుతున్నార‌న్నారు. ఇలా బారిన ప‌డిన‌వారు క‌రోనా స‌మ‌యంలో పూర్తి స‌మ‌యంలో వైద్యులు అందుబాటులోకి లేక‌, స‌రైన వైద్య స‌దుపాయం అంద‌క అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 

అంతేగాక రానున్న‌ది వ‌ర్షాకాల‌మ‌ని ఈ కాలంలో గోతులు క‌నిపించ‌క వాహ‌న చోధ‌కులు వాటిల్లో ప‌డి మ‌ర‌ణించే ప్ర‌మాదం కూడా పొంచి ఉంద‌ని ఆందోళన వ్య‌క్తంచేశారు. గ‌తంలో ఇటువంటి సంఘ‌ట‌ల‌నలు కూడా జ‌రిగాయ‌ని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు.  ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్ప‌టికైనా జీవీయంసీ క‌మిష‌న‌ర్ స్పందించి గోతుల‌న్ని పూడ్చే విధంగా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స‌త్య‌నారాయ‌ణ డిమాండ్ చేశారు.   ఈ కార్యక్ర‌మంలో ‌28వ వార్డు బీజేపీ క‌న్వీన‌ర్ సింహాచ‌లం,  కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌, సీనియ‌ర్ నాయ‌కులు శ్రీ‌నివాస్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

హైకోర్టులో కరోనా మార్గదర్శకాలు

Tags:The pits should be buried along

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *