The plane that crashed in Karachi

కరాచీలో కుప్పకూలిన విమానం

-విమానంలో 90మంది ప్రయాణికులు, 7మంది సిబ్బంది.

Date:22/05/2020

కరాచీ ముచ్చట్లు:

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ విమానం కుప్పకూలిపోయింది. విమానాశ్రయానికి నాలుగు కి.మీల దూరంలో మోడల్‌ కాలనీ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పాకిస్థాన్‌ ఎయిర్‌ పోర్టు అథారిటీ అధికార ప్రతినిధి అబ్దుల్‌ సత్తార్‌ ధ్రువీకరించారు. లాహోర్‌ నుంచి కరాచీకి వస్తున్న ఏ-320 విమానంలో 90 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ ఘటనతో కరాచీలోని అన్ని పెద్ద ఆస్పత్రుల్లో ఆరోగ్యశాఖ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ విమానం జనావాసాల మధ్య కూలడంతో నాలుగు ఇళ్లు దెబ్బతిన్నాయి. కాసేపట్లో ల్యాండింగ్‌ కావాల్సి ఉండగా. అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది..

పూడ్చి పెట్టిన బాలిక శవం పై అత్యాచార యత్నం

Tags: The plane that crashed in Karachi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *