విమానాన్నికూల్చేసింది మేమే: ఇరాన్

Date:11/01/2020

న్యూ  ఢిల్లీ  ముచ్చట్లు:

ఇరాన్, అమెరికా దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న తరుణంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్ కు చెందిన బోయింగ్ విమాన ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తించింది. విమానాన్ని కూల్చింది ఎవరు? అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది.ఈ తరుణంలో, విమానాన్ని తామే కూల్చేశామంటూ ఇరాన్ ఎట్టకేలకు ఒప్పుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి జవద్ జరీఫ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడలేదని తెలిపారు. కేవలం మానవ తప్పిదంగానే దీన్ని పరిగణించాలని కోరారు. అమెరికా దుందుడుకు చర్యలే ఈ ఘటనకు దారి తీశాయని చెప్పారు. మృతుల కుటుంబసభ్యులకు, తమ పౌరులను కోల్పోయిన దేశాలకు క్షమాపణలు చెబుతున్నామని అన్నారు.విమానం కూలిపోయిన తర్వాత… ఇరానే ఈ చర్యకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. కానీ, ఇరానే విమానాన్ని కూల్చిందంటూ అమెరికా, కెనడా ఇంటెలిజెన్స్ విభాగాలు ప్రకటించాయి. దీనికి తోడు, విమానాన్ని ఓ అగ్నిగోళం వంటి వస్తువు తాకిన ఓ వీడియో కూడా బహిర్గతమైంది. ఈ నేపథ్యంతో, చివరకు ఇరాన్ నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్ కు చెందిన బోయింగ్ విమానం కుప్పకూలి, పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 176 మంది దుర్మరణం పాలయ్యారు.

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

Tags: The plane was ourselves: Iran

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *