అక్కడి పోలీసులకు  ఇక్కడేం పని : తెరాస

The police are working here: TRS

The police are working here: TRS

Date:15/09/2018
హైదరాబాద్ ముచ్చట్లు :
తెలంగాణ లో చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు రాజకీయనాయకుడు కాదు. ఓ మాయల మరాఠీ. చంద్రబాబు ఏపి ఇంటెలిజెన్స్ వాళ్ళతో ఏపీ డీజీపీ ఆఫీస్ ను డెన్ గా వాడుకొని తెలంగాణ లో సర్వే చేపిస్తున్నారని తెరాస కార్యదర్శి గట్టు రాంచందర్ రావు ఆరోపించారు.  శనివారం తెలంగాణ భవన్ లొ మీడియాతో అయన ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ,ఎంపీ బాల్క సుమన్ కలసి మాట్లాడారు.
చంద్రబాబు ఒక దొంగల ముఠా ను ఏర్పాటు చేసి తెలంగాణా కు పంపారు. .దొంగ లే అనుకుని తెలంగాణ ప్రజలు పట్టుకొని తంతే దిక్కెవరని అయన అన్నారు. అక్రమంగా సంపాదించి న డబ్బుతో తెలంగాణ లో ఖర్చు పెట్టీ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేద్దాం అని చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. ఏబీ వెంకటేశ్వర్ రావు ,ఏపీ ఇంటలిజెన్స్ పొలిటికల్ అధికారి చంద్రబాబు కు బ్రోకర్. ఆయనకు ఇక్కడ ఏం పని అని ప్రశ్నించారు.
ఈ అంశంపై గవర్నర్,  డిజిపి కి పిర్యాదు చేస్తాం. .స్పందించక పోతే టిఆర్ఎస్ కార్యకర్త లు, ప్రజలు వెంట బడి తరిమే ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. ఒక వేళ చర్యలు తీసుకో క పోతే జరిగే పరిణామాల కు టిఆర్ఎస్ కు సంబంధం లేదు. చంద్రబాబు,  యనతో కలిసి పోవాలనుకుంటున్న  కాంగ్రెస్ బాధ్యత వహించాలని అన్నారు.
ఇన్నాళ్లు చంద్రబాబు పై కేసులు వేసిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఆయన చేతులు పట్టుకొని తిరుగుతున్నారు. ఎన్ఠీఆర్ కుటుంబానికి సిగ్గు వుంటే చంద్రబాబు ను తరమాలి. చంద్రబాబు చేసిన అక్రమాలకు నాలుగైదు సార్లు జీవిత ఖైదు శిక్ష వేయాలని అన్నారు. ఈయనపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడితే తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని అడగాలట.
మహారాష్ట్ర లో కేసులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న చంద్రబాబు.. స్టే లో వున్న కేసులకు విచారణకు వెళ్ళవచ్చు కదా అని అడిగారు. చంద్రబాబు కుట్రలు ఆపకపోతే తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు డబ్బు సంచులను తెలంగాణ నుంచి విత్ డ్రా చేసుకోకపోతే టిఆర్ఎస్ దళాలు పట్టుకొని చట్టానికి అప్పగిస్తాయి.
డబ్బులు పంచి సీట్లు గెలవాలని చూస్తే తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. .గతం లో డబ్బులు పంచి ఎమ్మెల్యేలను కొందామని ప్రయత్నం చేసి అడ్డంగా దొరికి పోయావు.. మళ్లీ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటామని అన్నారు. ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ నక్క  జిత్తుల చంద్రబాబు మళ్ళీ కుట్రలు మొదలు పెట్టారు.
వందల కోట్ల రూపాయలు తెలంగాణ కు తరలించారు. లంగాణ ను కలుషితం చేసేందుకు చంద్రబాబు ఏపి ఇంటెలిజెన్స్ ను వాడుకుంటున్నారు.  పక్క రాష్ట్రాల ఇంటెలిజేన్స్ పోలీస్ లు తెలంగాణ లో ఎందుకు తిరుగుతున్నారని అడిగారు.
Tags:The police are working here: TRS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *