బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్ ముచ్చట్లు:

 

చి చి పాడు సమాజం….వాయు వరసలు మరిచి పోయి….*తల్లితో సహజీవనం .. కూతురుపై అత్యాచారం.ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ముదినేపల్లిలో వెల్లడించారు.ముదినేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త వదిలేయడంతో పదేళ్ల పాప, ఏడేళ్ల బాబుతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు చెందిన ఎం.ఉదయ్ కుమార్ ఏడాది కిందట పరిచయం ఏర్పడి అది కాస్తా సహజీవనంగా మారింది.ఉదయ్ కుమార్ నమ్మించి రూ.2.20 లక్షలు నగదు తీసుకున్నాడు. మహిళ పనికి వెళ్లినప్పుడు ఇంటిలో ఒంటరిగా ఉన్న పదేళ్ల బాలికను పలుసార్లు బెదిరించి, కొట్టి అత్యాచారం చేశాడు. గత నెల 19న అర్ధరాత్రి వేళ బాలికపై అత్యాచారానికి యత్నిస్తుండగా మహిళ చూసి అతన్ని నిలదీసింది. ఈ విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించి బాలికను, తల్లిని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కేసు పెట్టకుండా రాజీ చేసుకోవాలంటూ మహిళపై గ్రామానికి చెందిన సురేశ్, అశ్విని, కిశోర్, విజయలక్ష్మి ఒత్తిడి తీసుకొచ్చారు. వినకపోవడంతో దాడి చేసి కొట్టారు. దీంతో ఈ నెల 16న బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎన్.మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు వైద్య పరీక్షలు చేసి విచారణ నిర్వహించారు. నిందితుడిని మంగళవారం ఉదయం ద్వారకా తిరుమల మండలం కన్నాపురంలో అరెస్టు చేసి న్యాయస్థానానికి తరలించగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేసిన కైకలూరు రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్సై వెంకట్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ శంకరరావు, కానిస్టేబుల్ నాగబాబులను ఆయన అభినందించారు. రాజీకి రానందుకు బాధిత మహిళపై దాడి చేసిన నలుగురిని త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.

 

Tags:The police have arrested the accused in the rape of the girl.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *