Natyam ad

బుచ్చిరెడ్డిపాలెం ఈశ్వరమ్మ హత్య కేసును చేదించి పోలీసులు

నెల్లూరు  ముచ్చట్లు:

ఫిబ్రవరి 21న బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో ఈశ్వరమ్మ (70) అనే వృద్ధురాలు హత్య కేసును చేదించి పోలీసులు..26 ఏళ్లకే నరరూప రాక్షసుడి లా,నడిచే మృత్యువు లా మారిన షేక్ రసూల్..ఒంటరిగా వున్న వృద్ధులే వీడి టార్గెట్. బంగారం నగదు కోసం అత్యంత కిరాతకంగా చంపడమే వీడి లక్ష్యం.వీడి పై 2018 లో హత్య కేసు,మళ్ళీ దొంగతనం కేసు ఇపుడు బుచ్చిలో ఈశ్వరమ్మ హత్య.కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించిన నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వర్ రెడ్డి.ఈనెల 24వ తేదీన బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలోని ఒక ఇంటిలో దుర్వాసన వస్తుంది అన్న చుట్టుపక్కల వారి సమాచారం

 

 

 

Post Midle

మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా ఈశ్వరమ్మ అనే వృద్ధురాలు చనిపోయిన స్థితిలో కనిపించగా వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసులో అనేక కోణాల్లో లోతుగా దర్యాప్తు చేయగా కొన్ని రోజుల క్రితం మృతురాలు ఈశ్వరమ్మ ఇంటికి వుడ్ వర్క్ కోసం వచ్చిన షేక్ రసూల్ అనే పాత నేరస్థుడు ఈశ్వరమ్మ ఒంటరిగా ఉంటుందని గమనించి 21వ తేదీనే బంగారం కోసం వృద్ధురాలని అత్యంత కిరాతకంగా బండరాయితో తలపై మోది గొంతు నులిమి హత్య చేసినట్టు ముద్దాయి ఒప్పుకున్నాడని ముద్దాయిషేక్ రసూల్ వద్ద నుండి ఈశ్వరమ్మ కు చెందిన 80 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామనినేరస్థుడు గతంలో కూడా దొంగతనాలకు పాల్పడి ఉన్నాడని, 2018లో ఇదే తరహాలో కావలిలో కూడా ఒక ఇంటిలో దూరి వృద్దురాలిని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్యచేసి బంగారం దోచుకున్నాడని ఇతనికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తెలియజేశారు.

 

Tags:The police have registered the case of Eswaramma’s murder

Post Midle