వ్యక్తిని కాపాడిన పోలీసులు
నల్లగొండ ముచ్చట్లు:
నల్లగొండ టూటౌన్ పోలీసులు ఒక వ్యక్తిని కాపాడారు. బ్రాహ్మణ వెల్లెంల గ్రామానికి చెందిన శ్రీను -కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు సిద్ధమైయాడు. రైల్వే ట్రాక్ పై సెల్ఫి వీడియో తీసుకుని స్నేహితులకు షేర్ చేసాడు. శ్రీను స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా లొకేషన్ ట్రేసవుట్ చేసారు. రైలు వస్తుందనగా శ్రీనును ట్రాక్ పై నుంచి బయటికి తీసుకువచ్చారు. తరువాత ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి శ్రీను కు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Tags: The police saved the man

