విలేకరి హత్య కేసును చేధించిన పోలీసులు

-ప్రధాన ముద్దాయిగా వైసీపీ నాయకుడు కొమ్మినేని రవిశంకర్ గా గుర్తింపు

Date:29/06/2020

విజయవాడ  ముచ్చట్లు:

నందిగామ మండలం మునగచర్ల గ్రామానికి చెందిన యూట్యూబ్ విలేకరి గంటా నవీన్ హత్య కేసును పోలీసులు చేధించారు. విలేకరి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా మాగల్లు గ్రామానికి చెందిన కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్, వైసీపీ నాయకుడు కొమ్మినేని రవిశంకర్‌గా తేల్చారు. రవిశంకర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. కేసులో పాత్రధారులు, సూత్రదారులైన ఎనిమిది మంది నిందితులను పోలీసులు నేడు మీడియా ముందు ప్రవేశపెట్టారు. రాజకీయంగా కొమ్మినేని రవిశంకర్‌ను ఎదగనివ్వకుండా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టును పెడుతున్నారనే నెపంతో నవీన్‌ను హత్య చేసినట్లు నందిగాం డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. ఈ హత్యకు పదో తేదీ నుండి రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. పథకం ప్రకారం 14వ తేదీన నందిగామ బోస్ డ్రైవింగ్ స్కూల్ సమీపంలో హత్య చేసి.. బైపాస్‌ రోడ్డు సమీపంలో పూడ్చి పెట్టారు. అయితే అక్కడ వాసన రావడంతో గోనెల సాయి అనే వ్యక్తి ఇంటి సమీపంలో గొయ్యి తీసి పూడ్చి పెట్టారని డీఎస్పీ వివరించారు.

ఆది సాయికుమార్ ‘శ‌శి’ చిత్రం డ‌బ్బింగ్‌ ప‌నులు ప్రారంభం

Tags:The police who hit the reporter’s murder case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *